జేఎన్టీయూహెచ్‌ విద్యార్థికి గవర్నర్‌ అభినందన

జేఎన్టీయూహెచ్‌ విద్యార్థికి గవర్నర్‌ అభినందన
x
Rajesh Khanna (File Photo)
Highlights

లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో రాష్ట్రంలో 'కనెక్ట్‌– చాన్సలర్‌'' పేరుతో రాష్ట్రస్థాయిలో కవితలు, వ్యాసరచన పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఈ...

లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో రాష్ట్రంలో 'కనెక్ట్‌– చాన్సలర్‌'' పేరుతో రాష్ట్రస్థాయిలో కవితలు, వ్యాసరచన పోటీలను నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఈ రాష్ట్ర స్ధాయిలో ఆన్‌లైన్‌ పోటీల్లో పాల్గొని జేఎన్టీయూహెచ్‌ రిసెర్చ్‌ స్కాలర్‌ రాజేష్‌ కన్నాను ప్రతిభను చాటాడు. దీంతో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ రాజేష్ కన్నా ప్రతిభను మెచ్చుకుని అతన్ని ప్రశంస పత్రంతో అభినందించారు. జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అతనికి ప్రశంసపత్రాన్ని అందజేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లోని ఎంతో ప్రతిభావంతులైన విద్యార్ధులు కనెక్ట్‌– చాన్సలర్‌ పోటీల్లో పాల్గొన్నప్పటికీ రాజేష్‌ఖన్నా కవితలు, వ్యాసరచనలు అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో న్యాయ నిర్ణేతలు రాజేష్‌కన్నాను విజేతగా ప్రకటించారు. రాజేష్‌కన్నా ఇప్పటికే జేఎన్టీయూహెచ్‌లో స్కాలర్‌గానే కాకుండా సామాజిక స్పృహ కలిగిన రచయితగా పలు పోటీల్లో ప్రతిభను ప్రదర్శించారు. తాజాగా గవర్నర్‌ నిర్వహించిన పోటీల్లో పాల్గొని ప్రశంస పొందటం పట్ల యూనివర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు హర్షం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories