Karimnagar: కోటిలింగాలకు రూ.3 కోట్లు

Karimnagar: కోటిలింగాలకు రూ.3 కోట్లు
x
Kotilingala Temple
Highlights

రాష్ట్రంలో ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన ఆలయాలు, చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఇప్పటికీ అవన్నీ రాష్ట్రంలో ఓ ప్రత్యేకమైన ఖ్యాతిని సంతరించుకున్నాయి.

రాష్ట్రంలో ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన ఆలయాలు, చారిత్రక కట్టడాలు ఉన్నాయి. ఇప్పటికీ అవన్నీ రాష్ట్రంలో ఓ ప్రత్యేకమైన ఖ్యాతిని సంతరించుకున్నాయి. కాగా వాటి అభివృద్ది కోసం ప్రభుత్వం ఎంతగాను కృషి చేస్తుంది. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ ప్రభుత్వం ఆలయాల అభివృద్దికి, చారిత్రక ప్రాంతాల అభివృద్దికి పెద్ద పీట వేస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యాదాద్రి ఆలయాన్ని అభివృద్ది చేస్తుంది. అదే విధంగా వేముల వాడ రాజన్న ఆలయం, భద్రాద్రి రాములోరి ఆలయాలను కూడా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం నిధులను విడుదలచేసింది.

వాటితో పాటు గాను రాష్ట్రంలో ఉన్న అతిపురాతనమైన, శిధిలావస్తకు చేరిన ఆలయాలకు కూడా ప్రభుత్వం మెరుగులు దిద్దుతుంది. ఈ కోణంలోనే రాష్ట్రంలో అత్యంత ప్రాచీన చారిత్రక ప్రాంతంగా గుర్తింపు పొందిన వెల్గటూర్‌ మండలం కోటిలింగాలను పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగానే అభివృద్ధి పనులను చేయడానికి రూ.3కోట్లు విడుదల చేస్తూ జీవో జారీ చేసింది. గతంలో ఆ ప్రాతాన్ని అభివృద్ది చేయడానికి రూ.2కోట్లను విడుదల చేసింది ప్రభుత్వం. ఆ నిధులతో పుష్కరఘాట్లు నిర్మించి, వివిధ సౌకర్యాలు కల్పించి గోదావరిలో బోటింగ్‌ను సైతం ప్రారంభించారు.

వాటితో పాటు పుష్కరాల సమయంలో ఆలయం చుట్టూ సీసీరోడ్ల నిర్మాణం చేసారు. ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం వెల్గటూరు నుంచి కోటిలింగాల దాకా మూడున్నర కిలోమీటర్ల వరకు తారురోడ్డు, అదే విధంగా వెల్గటూరు- కోటిలింగాల మధ్య వాగుపై బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేశారు. అంతే కాక సెంట్రల్‌ లైటింగ్‌, హరితహోటల్‌ నిర్మాణం, మ్యూజియం, జింకల పార్కు నిర్మాణం కోసం అధికారులు గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా ఆ మేరకు నిధులు కేటాయించింది ప్రభుత్వం. ఇవి కూడా కొటిలింగాలలో అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతమంతా పర్యాటక శోభను సంతరించుకోనున్నది. ప్రభుత్వం ఈ విధంగా పుణ్యక్షేత్రాలను అభివృద్ది చేయడానికి నిధులు కేటాయించడంతో, భక్తులు, స్థానికులు, పర్యాటకుల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories