పౌరసత్వ సవరణ బిల్లుపై వ్యతిరేకత

పౌరసత్వ సవరణ బిల్లుపై వ్యతిరేకత
x
తెలంగాణ రాష్ట్ర ముఖ‌్యమంత్రి కేసీఆర్
Highlights

తెలంగాణ రాష్ట్ర ముఖ‌్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకించంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ‌్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును వ్యతిరేకించంది. దీంతో ఈ అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆరేళ్లలో కేంద్రం ప్రతిపాదించిన బిల్లును వ్యతిరేకించడం మొదటిసారి. ఈ బిల్లుకు వ్యతిరేకంగా కేసీఆర్ ప్రభుత్వం ఓటు వేయాలని విప్ ను జరీచేసింది. ఈ బిల్లుపై మైనారిటీలపై అసంతృప్తి చెందడం, కేంద్రప్రభుత్వం రాజకీయాలను అనుసరిస్తున్న పద్దతులు, ఇతర కారణాల వలన ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే గడిచిన ఆరేళ‌్లలో ఉన్న అంశాలను పరిశీలిస్తే 2014 ఎన్నికల్లో కేంద్రంలో భాజాపా నేతృత్వంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చిన మొదట్లోనే ఖమ్మం జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలను ఏపీలో ఆర్డినెన్స్ ద్వారా విలీనం చేయడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అసంతృప్తి చెందారు. అయినప్పటికీ కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులను ఆమోదించింది. ఆ తరువాత కొన్ని రోజులకు ఆ గొడవ సర్ధుమనిగింది.

తరువాత పెద్దనోట్ల రద్దు, జీఎస్టీని ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టగా దానికి కేసీఆర్ ప్రభుత్వం మద్దతు పలికింది. అంతా బాగానే ఉన్నప్పటికి సడంగా పరిస్థితులు మారడంతో 2018 శాసనసభ,2019 పార్లమెంటు ఎన్నికల సమయంలో ఈ రెండుపార్టీలు ప్రతిసారీ విమర్శించుకుంటూనే ఉన్నాయి. అయినప్పటికీ ఎన్డీయే ప్రభుత్వం రెండో సారి ప్రవేశపెట్టిన బిల్లును అంగీకరించి తాజాగా పౌరసత్వ బిల్లును వ్యతిరేకించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories