దుకాణాలకు సరి బేసి విధానం

దుకాణాలకు సరి బేసి విధానం
x
Highlights

తెలంగాణలోని నగర పాలక పరిధిలో ఉన్న దుకాణాలను సిరి బేసి విధానాన్ని అమలు చేసి తెరచుకోవచ్చని నిన్న జరిగిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ తెలిపిన సంగతి తెలిసిందే.

తెలంగాణలోని నగర పాలక పరిధిలో ఉన్న దుకాణాలను సిరి బేసి విధానాన్ని అమలు చేసి తెరచుకోవచ్చని నిన్న జరిగిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కరీంనగర్‌ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న దుకాణాల్లో సరి బేసి విధానాన్ని అమలు చేస్తున్నారు. అందుకు సంబంధించిన ఆదేశాలు అందుకున్న మున్సిపల్‌ సిబ్బంది ఇప్పటికే నగరంలోని దుకాణాలకు నంబర్లు వేస్తున్నారు. ఈ విషయాన్ని నగరపాలక సంస్థ కమీషనర్‌ వల్లూరి క్రాంతి తెలిపారు. మున్సిపల్‌ సిబ్బంది వేసిన నంబర్ల ప్రకారమే సరి బేసి సంఖ్యలను అనుసరించి వారికి కేటాయించిన తేదీల్లో దుకాణాలు తెరుచుకోవచ్చని తెలిపారు. అంతే కాకుండా దుకాణాలను మొత్తం మూడు క్యాటగిరీలుగా విభజించారు.

క్యాటగిరి వారిగా దుకాణ సముదయాలను చూసుకంటే నిత్యావసర దుకాణాలు, మద్యం దుకాణాలు, నిర్మాణ రంగానికి సంబందించిన దుకాణాలు. ఇక క్యాటగిరి బి సబంధించిన దుకాణాల సముదాయాలను చూసుకుంటే బట్టల దుకాణాలు, పాదరక్షల దుకాణాలు ఉన్నాయి. ఇక సీ క్యాటగిరికి చెందిన వాటిలో హోటల్స్‌, స్కూల్స్‌, సినిమా హాల్స్‌, జిమ్స్‌ ఉన్నాయి. ఈ క్యాటగిరిలో ఏ, బీ క్యాటగిరి దుకాణాలు వాటికి కేటాయించి సమయంలో తెరుచుకునే వెసులు బాటును ఇవ్వగా, సీ క్యాటగిరిలో దుకాణాలు మూసి ఉంచే విధంగా చర్యలు తీసుకోనున్నారు.

ఇక క్రయ విక్రయాలను కొనసాగించే దుకాణాలు ప్రభుత్వం ఆదేశాలను తప్పకుండా పాటించాలని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంగిస్తే సంబందిత వ్యక్తలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. దుకాణాల్లో సామాజిక దూరం పాటించాలని, ప్రతి ఒక్కరు మాస్కులు ధరించాలని కమీషనర్‌ సూచించారు. అదే విధంగా ప్రతి ఒక్క షాపుల్లో సానిటైజర్లు తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలన్నారు. ప్రజలు తిరిగే ప్రదేశంలో ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలని సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories