ఆన్‌లైన్‌లో మామిడి పండ్ల ఆర్డర్..ఎలాగంటే..

ఆన్‌లైన్‌లో మామిడి పండ్ల ఆర్డర్..ఎలాగంటే..
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డైన్ కొనసాగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రజలకు తాజా పండ్లను అతి తక్కువ ధరకు అందించడానికి ప్రభుత్వం ఫోన్ కొట్టు పండ్లు పట్టు కార్యక్రమాన్ని చేపట్టింది.

తెలంగాణ రాష్ట్రంలో లాక్ డైన్ కొనసాగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రజలకు తాజా పండ్లను అతి తక్కువ ధరకు అందించడానికి ప్రభుత్వం ఫోన్ కొట్టు పండ్లు పట్టు కార్యక్రమాన్ని చేపట్టింది. తెలంగాణ ఉద్యానశాఖ, ఉద్యానాభివృద్ధి సంస్థ సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి మొదటి రోజు నుంచి చక్కని స్పందన లభిస్తోంది. పట్టణంలోని ఎంతో మంది ప్రజలు తమకు కావలసిన పండ్ల కోసం ఫోన్ చేసి ఆర్డర్లు ఇస్తున్నారు. ఒక్కొ రోజు సుమారుగా 254 మంది వినియోగదారులు తమకు కావలసిన మామిడిపండ్లను ఆర్డర్ చేసారని అధికారులు తెలిపారు. ఒక్కరోజే 2,085 కిలోల మామిడి పండ్లు బుకింగ్ చేసుకున్నారని తెలిపారు.

కాగా వినియోగదారులకు అప్పుడప్పుడూ ఫోన్ కలవక పోవడంతో వారు చాలా ఇబ్బందులు పడుతున్నారనే గుర్తించారు. వినియోగదారుల సౌకర్యార్ధం ఆన్‌లైన్‌లో పండ్ల బుకింగ్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లుగా అధికారులు తెలిపారు. కాగా ఈ ఆన్ లైన్ బుకింగ్ విధానం హైదరాబాద్, సికింద్రాబాద్ నగర వాసులకు మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇకపై పండ్లు కావాలనుకునే వారు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు tfresh.org అనే వెబ్‌సైట్‌లోకి వెల్లి బుక్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆర్డర్ చేసుకున్న వారికి రూ.350కి 5 కిలోల బంగినపల్లి మామిడి పండ్లను సప్లై చేస్తామని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories