తెలంగాణ విద్యార్థినులకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ

తెలంగాణ విద్యార్థినులకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

ప్రస్తుత సమాజంలో ఎక్కడ చూసినా ఆడపిల్లలమీద అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఆడ పిల్లలను ఇంటి నుండి బయటికి పంపించడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు....

ప్రస్తుత సమాజంలో ఎక్కడ చూసినా ఆడపిల్లలమీద అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఆడ పిల్లలను ఇంటి నుండి బయటికి పంపించడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు. పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా ఇవే సంఘటనలు. రాష్ట్రంలో వ్యాప్తంగా చూసుకుంటే సగటున రోజుకు 10 నుంచి 20 వరకు ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ప్రభుత్వాలు, న్యాయ స్థానాలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా అరాచకాలు మాత్రం ఆగడంలేదు.

ఇదే నేపధ్యంలో మొన్న జరిగిన దిశా ఘటన తరువాత తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయానికొచ్చింది. పాఠశాల నుంచి కళాశాలల్లో చదివే బాలికల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించాలనుకుంటుంది. దీనికి తగిన చర్యలకు శ్రీకారం చుడుతోంది. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థినులకు 3 నెలల పాటు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకుంది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించిన క్లాసులను డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి మాసాల్లో నిర్వహించనున్నారని తెలిపింది. ఆడపిల్లలు ధైర్యంగా బయటికి వెళ్లి ఎంతటి సమస్యనైనా ఎదుర్కొనే టట్టు కరాటే, జూడో పోరాట విద్యల్లో నైపున్యాన్ని సాధించే విధంగా తయారు చేయాలని విద్యాశాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఈ విద్య నేర్చుకోవడం వలన బాలికలకు ఆత్మస్థైర్యం పెరుగుతుందని తెలిపింది.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories