ఆ రంగం వారికి లాక్‌డౌన్ నుంచి మినహాయింపు...తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆ రంగం వారికి లాక్‌డౌన్ నుంచి మినహాయింపు...తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
x
CM KCR(File photo)
Highlights

తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల దృష్ట్యా సీఎం కేసీఆర్ లాక్ డౌన్ ని మే 7వ తేదీవరకు పొడిగించిన విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల దృష్ట్యా సీఎం కేసీఆర్ లాక్ డౌన్ ని మే 7వ తేదీవరకు పొడిగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కొన్ని రంగాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం కేవలం ఫుడ్ ప్రాసెసింగ్ సహా పరిమిత రంగాలకు మాత్రమే అనుమతి ఇచ్చింది. ఇప్పుడు తాజాగా మరో రంగం వారికి కూడా శుభవార్తను తెలిపింది. రాష్ట్రంలో ఉన్న 3 లక్షల మంది మత్స్యకారులు తమ వృత్తిని కొనసాగించవచ్చని తెలిపింది. చెరువుల్లో చేపల వేటకు అనుమతి ఇస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది.

మత్య్సకారులంతా కరోనా సోకకుండా ఉండేందుకు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని, నిబంధనలకు పాటించాలని ప్రభుత్వం సూచించింది. దీంతో నష్టాల్లో ఉన్నమత్సకారులు వారి వ్యాపారాలను కొనసాగించి లాభాలను పొందనున్నారు. ఇప్పటి వరకు ఉపాధిలేని వారంతా సీఎం ఆదేశాలతో ఉపాధిని పొందనున్నారు. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు చేయకముందు సుమారుగా 3 లక్షల మెట్రిక్ టన్నుల చేపల ఉత్పత్తి సామర్థ్యం ఉండేది. కానీ లాక్‌డౌన్ నిర్వహించడంతో చేపల ఉత్పత్తి తగ్గి కొన్ని ప్రాంతాల్లో కొరత కూడా ఏర్పడింది.

ఇక తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. గత రెండు రోజులుగా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. నిన్న కొత్తగా 11 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో 1001 చేరింది. కరుణ వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 316 కాగా.. ఈ ప్రాణాంతక వైరస్ బారినపడి 25 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో 660 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ తొమ్మిది మంది డిశ్చార్జ్ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు నమోదైన అత్యధిక కేసులు ఒక్క హైదరాబాద్ లోనే నమోదు కావడం గమనార్హం. హైదరాబాదులో 540 కేసులు నిర్ధారణ అయ్యాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories