ఏపీకి తెలంగాణ భారీ షాక్.. పైఎత్తు వేస్తూ సంచలన నిర్ణయం!

ఏపీకి తెలంగాణ భారీ షాక్.. పైఎత్తు వేస్తూ సంచలన నిర్ణయం!
x
Highlights

జోగులాంబ గద్వాల జిల్లాలో కృష్ణా నదిపై ఉన్న జూరాల ప్రాజెక్టు దగ్గర మరో ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

జోగులాంబ గద్వాల జిల్లాలో కృష్ణా నదిపై ఉన్న జూరాల ప్రాజెక్టు దగ్గర మరో ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.ఈ మేరకు ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన గోదావరి జలాలపై జరుగుతున్న ఉన్నత స్థాయి సమీక్షలో ఈ ప్రాజెక్టు విషయంపై చర్చించనున్నారని సమాచారం. ఈ ప్రాజెక్టును నిర్మాణాన్నిచేపట్టి దాని ద్వారు కృష్ణా జలాలను సమర్థంగా వినియోగించుకోవాలని భావిస్తోంది. ఇందుకు గాను జూరాల ప్రాజెక్టుకు ఎగువ భాగాన 15 నుంచి 20 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌ నిర్మాణంపై ప్రభుత్వం నిపుణుల నుంచి నివేదిక కోరింది. ఇందుకు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారాన్ని అందించాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఇప్పటికే రోజుకు ఒక టీఎంసీ ఎత్తిపోసే విధంగా పథకాన్ని రూపకల్పన చేసింది. థరూర్ మండలం గూడెం దొడ్డి, ద్యాగాదొడ్డి గ్రామాల మధ్య కొత్త ప్రాజెక్టుకు అనువైన ప్రదేశంగా నీటి పారుదల శాఖ నివేదిక ఇచ్చింది. ఇటీవల విశ్రాంత ఇంజినీర్ల బృందం సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు గ్రామాలు, భూములు ఎక్కువగా ముంపునకు గురి కాకుండా ఉండేందుకు తక్కువ భూ సేకరణతో జలాశయం ఏర్పాటుకు క్షేత్రస్థాయిలో పరిశీలనలు చేసారు. రిజర్వాయర్ నిర్మాణంలో ముంపు ప్రాంతాలు ఎక్కువగా లేకుండా ప్రణాళికను సిద్దం చేసారు. పూర్తి వివరాలతో నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకొని జలాశయం నిర్మాణం చేపడితే ఉమ్మడి జిల్లాలో సుమారు 6 లక్షల ఎకరాలకు అదనంగా సాగునీరు అందే అవకాశం ఉంటుంది. గోదావరి జలాలపై ఆదివారం జరుగుతున్న సమీక్షలో ఈ కొత్త రిజర్వాయర్ అంశం కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇక పోతే కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ శనివారం నిర్వహించిన సమావేశంలో కొత్త నీటి పథకానికి సంబంధించి చర్చించేందుకు వెంటనే సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు సూచించినట్లుగా తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన నివేదికను సాంకేతికంగా పరిశీలించాలని అప్పటివరకు ప్రాజెక్టులను నిలిపివేయాలని ఏపీని కోరినట్లుగా తెలంగాణ కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌‌కు రాసిన లేఖలో మంత్రి అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories