Coronavirus: హైదరాబాద్ రెడ్ జోన్ ప్రాంతాలు ఏవో తెలుసా...

Coronavirus: హైదరాబాద్ రెడ్ జోన్ ప్రాంతాలు ఏవో తెలుసా...
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కాగా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కాగా వైరస్ ని కట్టడి చేయడానికి ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటికి రావాలని ప్రజలకు సూచింది. అనవసరంగా ప్రజలు బయటికి వస్తే పోలీసులు వారిపై లాఠీ చార్జ్ చేస్తున్నారు. దీంతో సుమారుగా ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. కాగా నిన్న ఒక్క రోజే రాష్ట్రంలో 10 పాజిటివ్ కేసులు నమోదవ్వడంతో ప్రభుత్వం మరింత పఠిష్ట చర్యలు చేపడుతుంది. ఆ క్రమంలోనే కరోనా బాధితులున్నఐదు ప్రాంతాల్నిక్వారంటైన్డ్ జోన్'గా ప్రకటించింది. కరోనా బాధితులు నివాసం ఉండే కాలనీలోని కిలో మీటర్ పరిధిలో రోడ్ జోన్ గా ప్రకటించారు. ఆ ప్రాంతాల ప్రజలకు ఆంక్షలు విధించింది. కిలో మీటర్ పరిధిలో ఉన్న వారందరికీ వైద్య పరీక్షలు చేసి అవసరమైన వారికి రక్త పరీక్షలు కూడా చేస్తున్నారు.

ఇక క్వారంటైన్డ్ జోన్ గా ప్రకటించిన ప్రాంతాల్లో కోకాపేట, చందానగర్, గచ్చిబౌలి, తుర్కయాంజల్, కొత్తపేట ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రజలు ఏప్రిల్ 14 వరకూ అస్సలు బయటకు రావొద్దని ప్రభుత్వం తెలిపింది. ఈ జోన్లలో ఉన్నవారికి నిత్యావసర సరుకులు, ఇతరత్రా వస్తువులు ఇంటి వద్దకే అధికారులు పంపిస్తున్నారు. అందుకు గాను ప్రజలకు ప్రభుత్వానికి సహకరించాలనీ, ప్రభుత్వ రూల్స్ పాటించాలని కోరింది. ఇంకా ఏమైనా అత్యవసర వస్తువులు కావాలనుకున్నా, సేవలు కావాలనున్నా టోల్ ఫ్రీ నంబరులకు కాల్ చేయాలని తెలిపారు.

ఇక రాష్ట్రంలో మార్చి 27, 2020 శుక్రవారం నాటికి 59 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. వారిలో ఒకరు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ సోకకుండా అడ్డుకట్ట వేయాలంటే సోషల్ డిస్టెన్స్ పాటించాలని అధికారులు, వైద్యులు చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories