తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై జోరుగా అంచనాలు..

తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై జోరుగా అంచనాలు..
x
Highlights

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి.. తిరుగులేని విజయం సాధించి.. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టింది టీఆర్ఎస్. అధికారంలోకి వచ్చాక.. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కోక్కటిగా నేరవేరుస్తూ వడివడి అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు వెళ్లి.. తిరుగులేని విజయం సాధించి.. రెండోసారి అధికార పగ్గాలు చేపట్టింది టీఆర్ఎస్. అధికారంలోకి వచ్చాక.. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కోక్కటిగా నేరవేరుస్తూ వడివడి అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. తాజాగా మంత్రి వర్గవిస్తరణ త్వరలో జరగవచ్చని విపరితంగా ప్రచారం అవుతోంది. దీంతో అందరి దృష్టి మంత్రివర్గ పదవులపై విస్తరణపైనే పడింది. ఇక ఆశవాహులు ఎప్పుడేప్పుడు విస్తరణ జరుగుతుందా అని కళ్లకు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారట. అయితే ఆరంటే ఆరు బెర్తులు మాత్రమే ఖాళీ ఉన్నాయని తెలుస్తోంది. వాటిలో రెండు మహిళలకు కేటాయిస్తారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే. ఇక మిగిలింది నాలుగు మంత్రిపదవులు. అందులో కేసీఆర్ తనయుడు కల్వకుంట్ల తారక రామారావు, కేసీఆర్ అల్లుడు తన్నీరు హరీశ్ రావు ఇద్దరికి ఈసారి ఛాన్స్ ఖాయమని అంటున్నారు. ఇక మిగిలిన రెండు సీట్లు సీఎం కేసీఆర్ ఎవరికి కట్టబెడతారు అనేది ఉత్కంఠ రేపుతోంది.

తాజా విశ్వసనీయ సమాచారం ప్రకారం... తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దసరాకు మంత్రివర్గ విస్తరణ చేయబోతున్నట్లు సమాచారం. కొంతమంది అంచన ప్రకారం ప్రస్తుతానికి మహిళల్లో ఒక్కరికే మంత్రి ఇచ్చి.. ఇంకోకటి గుత్తా సుఖేందర్ రెడ్డికి ఇస్తారని పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇదిలా ఉండగా.. కొత్త క్యాబినెట్ లోకి సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌లను తీసుకుంటే... వారిద్దరికి పాత శాఖలే కేటాయిస్తారా లేక... ఏవైనా మార్పులు చేర్పులు చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ మనసులో ఏం ఉంది అనేది ఎవరు అంచనా వేయలేకపోతున్నారు. ఇక కొత్త క్యాబినెట్‌లో కేసీఆర్ ఎవరేవరికి మంత్రి పదవులు దక్కుతాయో అని ఇటు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు,, పార్టీ శ్రేణుల్లోనే కాకుండా ప్రజల్లోనూ తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మొత్తానికి ఈ ఉత్కంఠకు తెర పడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories