తెలంగాణ రాష్ట్రం తోలి ముఖ్యమంత్రి కేసీఆర్.. పథకాలు మరియు ప్రస్థానం..

తెలంగాణ రాష్ట్రం తోలి ముఖ్యమంత్రి కేసీఆర్.. పథకాలు మరియు ప్రస్థానం..
x
Highlights

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్ పార్టీ) వ్యవస్థాపక అధ్యక్షుడు. కేసీఆర్ అన్న పొడి అక్షరాలతో సుప్రసిద్ధుడు.

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్ పార్టీ) వ్యవస్థాపక అధ్యక్షుడు. కేసీఆర్ అన్న పొడి అక్షరాలతో సుప్రసిద్ధుడు. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా లోని చింతమడక గ్రామంలో 1954 ఫిబ్రవరి 17న రాఘవరావు, వెంకటమ్మ దంపతులకు జన్మించాడు. చంద్రశేఖర్ రావు కుటుంబం ఎగువ మానేరు డ్యాం నిర్మాణంలో భూమి కోల్పోయి చింతమడక గ్రామానికి వచ్చి స్థిరపడింది. దీనివల్ల ఇతను చిన్నతనంలో మధ్యతరగతి జీవితం అనుభవించాడు.

సిద్ధిపేట డిగ్రీ కళాశాలలో చరిత్ర, రాజనీతి శాస్త్రం, తెలుగు సాహిత్యం సబ్జెక్టులుగా బి.ఎ. పూర్తిచేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎం.ఎ (తెలుగు సాహిత్యం) చదివాడు. ఇతను 1969 ఏప్రిల్ 23న శోభ అనే అమ్మాయిని వివాహమాడారు. ఆయనకు కుమారుడు కల్వకుంట్ల తారక రామారావు, కుమార్తె కల్వకుంట్ల కవితలు ఉన్నారు. వీరు కూడా తండ్రి బాటలోనే నడుస్తూ తెలంగాణ సాధన కోసం ఉద్యమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర ఏర్పాటు అనంతరం కుమారుడు తారక రామారావు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రివర్గంలో చేరగా, కుమార్తె కవిత పార్లమెంటు సభ్యురాలైంది.

రాజకీయ జీవితం

ఆయన విద్యార్థి దశలో ఉన్నప్పటి నుంచే రాజకీయాల్లో చురుకుగా ఉండేవాడు. విద్యార్థి సంఘం అధ్యక్ష పదవికి పోటీచేసి ఓడిపోయాడు. విద్యార్థి దశ నుంచే కేసీఆర్‌కి రాజకీయ రంగంలోకి వెళ్ళాలనే స్పష్టత ఉండేది. అప్పటి కాంగ్రెస్ నాయకుడు అనంతుల మదన్ మోహన్ ఇతనికి రాజకీయ గురువు. 70 వ దశకంలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న కేసీఆర్, 1982లో తాను ఎంతగానో అభిమానించే నందమూరి తారక రామారావు పార్టీ పెట్టడంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి, తెలుగుదేశం పార్టీలో చేరాడు. 1983 ఎన్నికల్లో తన రాజకీయ గురువు మదన్ మోహన్‌పైనే పోటీచేసి గట్టి పోటీనిచ్చి 877 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

వరుస విజయాలు, మంత్రి పదవులు

1985లో తెలుగుదేశం తరఫున ఎన్నికల్లో పోటీచేసి రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. ఇది కేసీఆర్ రాజకీయ జీవితంలో తొలి విజయం. ఆ తరువాత 1989, 1994, 1999, 2001 (ఉప ఎన్నిక)లో వరుసగా గెలుపొందాడు. 1987-88 కాలంలో రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం కూడా సంపాదించాడు. 1992-93లో పబ్లిక్ అండర్ టేకింగ్ చైర్మెన్ పదవిని నిర్వహించాడు. 1997-98లో కేసీఆర్‌కు తెలుగు దేశం ప్రభుత్వంలో కేబినెట్ హోదా కలిగిన రవాణా మంత్రి పదవి లభించింది. 1999-2001 కాలంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర శాసనసభ డిప్యూటి స్పీకర్ పదవి కూడా నిర్వహించాడు. అయితే 1999లో చంద్రబాబు నాయుడు తన మంత్రివర్గంలో స్థానం కల్పించకుండా తప్పించడం కేసీఆర్‌ను అసంతృప్తుణ్ణి చేసింది.

తెలంగాణ రాష్ట్ర సమితి స్థాపన

ఆ తరువాత 2001 ఏప్రిల్ 21 నాడు తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి, డిప్యూటి స్పీకర్ పదవికి రాజీనామా చేసి 2001 ఏప్రిల్ 27న నూతనంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం నినాదంతో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశాడు. తొలిదశ తెలంగాణ ఉద్యమం, మలిదశలో తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ ప్రారంభించిన కార్యక్రమాలు కేసీఆర్‌ని ప్రభావితం చేశాయి. 2001లో కొత్తగా ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల ఏర్పాటు తెలంగాణ ఏర్పాటు ఏమీ అసాధ్యం కాదన్న అభిప్రాయం ఏర్పరిచింది. అదే సంవత్సరం తెలంగాణ ఉద్యమకారులతో ఏర్పాటుచేసిన సమావేశాల్లో రాష్ట్ర సాధన ఉద్యమం గురించి చర్చించాడు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటుచేయాలన్న ఆలోచనను బలపరిచాయి.

ఈ నిర్ణయం కేసీఆర్ తన రాజకీయ బలాబలాలపై ఉన్న అవగాహన కూడా అంచనా వేసే తీసుకున్నాడు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, నాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను మంత్రివర్గంలోకి తీసుకోకపోడం, విద్యుత్తు ఛార్జీల పెంపు వంటివి కేసీఆర్ నిర్ణయంపై ప్రభావం చూపాయి. మరోవైపు అప్రతిహతంగా అప్పటికి పదిహేనేళ్ళ పైచిలుకు 5 ఎన్నికల్లో సిద్ధిపేటలో వరుసగా గెలుస్తూండడంతో స్థానికంగా తనకు ఎదురులేదన్న అంచనాకు కూడా వచ్చాడు. తెరాస స్థాపనకు ముందు సైద్ధాంతికంగానూ తెలంగాణ ఏర్పాటు, దాని అవసరాల గురించి అధ్యయనం చేశాడు. తెరాసను స్థాపించిన 20 రోజులకు 2001 మే 17న తెలంగాణ సింహగర్జన పేరిట భారీ బహిరంగ సభ ఏర్పరిచి, తెలంగాణను రాజకీయ పోరాటం ద్వారా సాధిస్తామని ప్రకటించాడు. ఆపైన తన వాగ్ధాటికి, రాజకీయవ్యూహాలకు పదును పెట్టుకుంటూ సాగాడు.

2004 ఎన్నికలలో కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుండి గెలుపొందాడు. ఐదుగురు లోక్‌సభ సభ్యులున్న టీఆర్ఎస్ కాంగ్రెస్ నేపథ్యంలోని యుపిఎ కూటమిలో భాగస్వామిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నాయకులుగా కేసీఆర్, ఆలె నరేంద్ర కేంద్ర మంత్రులయ్యారు. 2004 నుండి 2006 వరకు కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కేసీఆర్ మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మంత్రి పదవులకు రాజీనామా చేసి, యూపీఏ నుంచి బయటకు వచ్చాడు. ఈ సమయంలో మంత్రి పదవులతో పాటు లోక్‌సభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి, ఉపఎన్నికలలో కరీంనగర్ స్థానం నుండి మళ్ళీ పోటీచేసి కాంగ్రెస్ పార్టీకి చెందిన టి.జీవన్ రెడ్డిపై రెండు లక్షలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించాడు.

2008లో మళ్ళీ రాష్ట్రమంతటా తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు చేసిన రాజీనామాతో జరిగిన ఉప ఎన్నికలలో మళ్ళీ కరీంనగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీచేసి 15000కు పైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. 15వ లోక్‌సభ ఎన్నికలలో మహబూబ్ నగర్ లోక్‌సభ స్థానం నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విఠల్ రావుపై గెలుపొందాడు. జనరల్ ఎన్నికల్లోనే కాకుండా పలుమార్లు రాజీనామాలు చేయగా వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా కేసీఆర్‌ను తిరిగి భారీ మెజారిటీలతో ఎన్నుకుని ప్రజలు విజయాలు కట్టబెట్టారు. ఒక దశలో రాజీనామా కేసీఆర్‌కు రాజకీయంగా పెద్ద అస్త్రంగా మారింది.

నిరాహార దీక్ష, పోరాటం, రాష్ట్ర సాధన

2009 నవంబరు 29న కేసీఆర్ తెలంగాణ సాధన లక్ష్యంగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టాడు చేపట్టడానికి కరీంనగర్ నుండి సిద్ధిపేట దీక్షాస్థలికి బయలుదేరుతుండగా మధ్యలో కరీంనగర్ దగ్గరలోని అలుగునూరు వద్ద పొలీసులు అరెస్టుచేసి ఖమ్మం పట్టణానికి తరలించారు. అదే రోజున పోలీసులు దీక్ష భగ్నం చేసి ఖమ్మం సబ్ జైలుకు తరలించి 29, 30 తేదీల్లో బంధించారు. 30న జైల్లోనే నిరాహార దీక్ష కొనసాగించడంతో అక్కడ నుంచి ప్రభుత్వాసుపత్రికి కేసీఆర్‌ని తరలించారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిత్వం

ఆయన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా జూన్ 2 మధ్యాహ్నం 12.57 కు ప్రమాణ స్వీకారం చేసారు. ఆయన తన నాలుగున్నర పాలన తరువాత సెప్టెంబర్ 2018లో తెలంగాణ శాసనసభను రద్దుచేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ 119 స్థానాల్లో పోటీచేసి 88 స్థానాల్లో విజయ దుందుభి మెగించింది. కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తొలి మంత్రివర్గం (2014-2018), కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రెండవ మంత్రివర్గం (2018 నుండి).

పథకాలు - ఆవిష్కరణలు

రైతుబంధు పథకం

♦ అమ్మఒడి మరియు కె.సి.ఆర్‌. కిట్‌ పథకం

♦ ఆరోగ్య లక్ష్మి పథకం

♦ కళ్యాణలక్ష్మి పథకం

♦ షాదీ ముబారక్ పథకం

♦ చేనేత లక్ష్మి పథకం

♦ తెలంగాణ ఆసరా ఫింఛను పథకం

♦ తెలంగాణ గ్రామజ్యోతి పథకం

♦ తెలంగాణ పల్లె ప్రగతి పథకం

♦ తెలంగాణకు హరితహారం

♦ ఫైబర్‌ గ్రిడ్‌ పథకం

♦ మన ఊరు - మన ప్రణాళిక (పథకం)

♦ మిషన్ కాకతీయ

♦ మిషన్ భగీరథ

♦ షాదీ ముబారక్ పథకం

♦ షి టీమ్స్

♦ టీ హబ్

♦ టీఎస్ ఐపాస్‌

♦ వీ హబ్‌

♦ తెలంగాణ రాష్ట్ర బీసీ కమీషన్

♦ తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్

♦ కంటి వెలుగు



Show Full Article
Print Article
More On
Next Story
More Stories