Telangana: నేడు కేబినెట్‌ భేటీ..

Telangana: నేడు కేబినెట్‌ భేటీ..
x
Highlights

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ బడ్జెట్‌పై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నది.

ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రగతి భవన్ లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ బడ్జెట్‌పై చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానున్నది. అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ర్టానికి రావలసిన నిధులతోపాటు పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి, రాష్ట్ర అభివృద్దికి సంబంధించిన అంశాలపై కూడా ఈ భేటీలో చర్చించనున్నట్టు తెలుస్తున్నది.

ఈ నేపథ్యంలో బడ్జెట్‌ రూపకల్పనకు ప్రభుత్వం కసరత్తును వేగవంతంచేసింది. దేశంలో నెలకొన్న ఆర్థికమాంద్యం, కేంద్ర పన్నుల వాటాలో తగ్గుదల, గ్రాంట్లలో కోత, జీఎస్డీపీ (గ్రాస్‌ స్టేట్‌ డొమెస్టిక్‌ ప్రొడక్ట్‌) వృద్ధిరేటు అంశాలను ఈ సందర్భంగా చర్చించనున్నారు. దీనికి సంబంధించి బడ్జెట్‌ ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1న పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. కాగా బడ్జెట్ కు సంబంధించి ఏ విధమైన పరిస్థితులను గమనంలోకి తీసుకొని అధికారులు లెక్కలను రూపొందిస్తున్నారన్న విషయం పై చర్చించనున్నారు.

ఇందులో భాగంగానే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో చేసినట్టుగానే భారీ అంచనాలకు పోకుండా వాస్తవిక అంచనాలతో 2020-21 బడ్జెట్‌ను రూపొందించాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు సమాచారం. దాంతో పాటుగానే ఆర్థిక మాంద్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి పైసాను పక్కాగా లెక్కించి కనీస అంచనాలతో బడ్జెట్‌ను రూపొందిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories