నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

నేటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
x
Highlights

నేటి నుండి రెండ్రోజులపాటు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. గురువారం ఉదయం 11 గంటలకు పబ్లిక్‌ గార్డెన్స్‌లోని అసెంబ్లీ హాల్లో శాసనసభ...

నేటి నుండి రెండ్రోజులపాటు తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. గురువారం ఉదయం 11 గంటలకు పబ్లిక్‌ గార్డెన్స్‌లోని అసెంబ్లీ హాల్లో శాసనసభ సమావేశం ప్రారంభం కానుంది. కొత్త మున్సిపల్ చట్టం ఆమోదం కోసం అసెంబ్లీని సమావేశపర్చుతున్న ప్రభుత్వం నూతన బిల్లును సభలో ప్రవేశపెట్టనుంది. ఇప్పటికే ముసాయిదా బిల్లుకు న్యాయశాఖ ఆమోదముద్ర వేయడంతో కొత్త చట్టంపై మంత్రివర్గ సహచరులకు ముఖ్యమంత్రి కేసీఆర్ వివరించారు. ప్రగతిభవన్‌లో సమావేశమైన కేబినెట్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టబోయే నూతన పురపాలక చట్టానికి ఆమోదం తెలిపింది. కొత్త చట్టం ఉద్దేశం దాని లక్ష్యాలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రివర్గ సహచరులకు వివరించారు.

నేటి శాసనసభలో కొత్త మున్సిపల్‌ చట్టాన్ని ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం తర్వాత రోజు చర్చించి ఆమోదించనుంది. అలాగే మండలిలోనూ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు. ఇక గతంలో జారీ చేసిన పలు ఆర్డినెన్సులకు కూడా ఆమోదం తెలిపి చట్టరూపం ఇవ్వనున్నారు. కేవలం కొత్త మున్సిపల్ చట్టం ఆమోదించడం కోసమే అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపర్చుతున్నందున ఈ రెండ్రోజులూ ఎలాంటి ప్రశ్నోత్తరాలు, అసెంబ్లీ ప్రోసీడింగ్స్‌ ఉండవు. ఇదిలాఉంటే, నూతన పురపాలక చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మున్సిపల్‌ ఎన్నికలకు వెళ్లనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories