అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం: పలువురు టీచర్ల అరెస్ట్

అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తం: పలువురు టీచర్ల అరెస్ట్
x
Highlights

నగరంలోని ఇందిరాపార్క్ ప్రాంతమంతా రణరంగంగా మారింది. ఉపాధ్యాయ సంఘాలు పోలీసులకు మధ్య తోపులాటలు జరిగాయి. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

నగరంలోని ఇందిరాపార్క్ ప్రాంతమంతా రణరంగంగా మారింది. ఉపాధ్యాయ సంఘాలు పోలీసులకు మధ్య తోపులాటలు జరిగాయి. దీంతో ఆ ప్రాంతమంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పూర్తి వివరాల్లోకెళితే ఉపాధ్యాయులు తమ హక్కుల సాధన కోసం ఛలో అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారు. కానీ ఇందుకు ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు ఇందిరా పార్కు ధర్నా చౌక్ వద్దకు చేరుకుని పెద్ద ఎత్తున ధర్నా చేసారు.

సీపీఎస్ విదానం రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి బయలుదేరారు. దీంతో పోలీసులు వారు అసెంబ్లీకి చేరుకోకుండా అప్రమత్తమయ్యారు. ఉపాధ్యాయులు ఇందిరాపార్కులో పెద్ద ఎత్తున భారీ కేడ్లను తోసి వచ్చి రోడ్డుపై బైఠాయించారు. కొంత మంది టీచర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు, వ్యాఖ్యలు చేశారు.

దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. బైఠాయించిన ఉపాధ్యాయుల కాలర్ పట్టుకుని పోలీసులు బలవంతంగా ఈడ్చుకెళ్లారు. మహిళా ఉపాధ్యాయులను కూడా అరెస్టు చేశారు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు పోలీసులు ప్రవర్తనపై విరుచుపడ్డారు. అరెస్ట్‌ చేసినవారిని వివిధ పోలీస్‌ స్టేషన్‌లకు తరలిస్తున్నారు. ఇదే కోణంలో జిల్లాల్లోనూ పోలీసులు పాఠశాలలకు చేరుకుని ముందస్తుగానే టీచర్లను అరెస్టు చేసారు. జనగామ, ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయులను ముందస్తు అరెస్ట్ చేశారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories