విద్యార్థి పై ప్రతాపం చూపిన టీచర్

విద్యార్థి పై ప్రతాపం చూపిన టీచర్
x
Highlights

విద్యార్థులు ఎక్కువగా ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర కంటే పాఠశాలలో ఉపాధ్యాయుల వద్దే ఎక్కువ సమయం గడుపుతుంటారు. అలాంటప్పుడు పిల్లలను ప్రేమగా చూసుకోవాల్సిన...

విద్యార్థులు ఎక్కువగా ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర కంటే పాఠశాలలో ఉపాధ్యాయుల వద్దే ఎక్కువ సమయం గడుపుతుంటారు. అలాంటప్పుడు పిల్లలను ప్రేమగా చూసుకోవాల్సిన టీచర్లు వారి పట్ల అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. చిన్న చిన్న తప్పులు చేసినా కూడా పెద్ద శిక్షలు వేస్తున్నారు. పిల్లలను క్రమశిక్షతో ఉంచాల్సిన ఓ టీచర్ క్రమశిక్ష తప్పి చిన్న పిల్ల అని చూడకుండా, ఒళ్లు మర్చిపోయి, కోపంతో ఊగిపోయి విద్యార్థిని ఇష్టం వచ్చినట్లు చితక బాదారు.

పూర్తి వివరాల్లోకెళితే నల్లకుంటలోని ఓ పాఠశాలలోఈ సంఘటన చోటు చేసుకుంది. హైస్కూల్లో 4వ తరగతి చదువుతున్న ఎన్.సాయి ప్రణీత్ అనే విద్యార్థిని క్లాస్ టీచర్ చితకబాదారు. విద్యార్థి చేసిన చిన్న తప్పుకు సహించుకోలేని టీచర్ తరగతి గదిలో ప్లాస్టిక్ స్కేల్‌తో చేయిపై, వీపుపై విపరీతంగా కొట్టారు. దీంతో ఆ విద్యార్ధి నొప్పితో ఎంతో బాధపడినప్పటికీ ఆ కనికరం లేని టీచర్ కాస్త కూడా జాలి లేకుండా ప్రవర్తించారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థి తల్లిదండ్రులు టీచర్‌ నిర్వాకంపై స్కూల్ యాజమాన్యాన్ని నిలదీసారు. అయినా పాఠశాల యాజమాన్యం వారి గోడును పట్టించుకోకుండా దిక్కున్నచోట చెప్పుకోండి అని బెదిరించారని వాపోయారు. 'ప్రతి క్లాస్ రూమ్‌లో సీసీటీవీ ఉందని, రికార్డులను పరిశీలించి టీచర్‌పై, నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి అని విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్‌ చేశారు. ఇంకెప్పుడు మరో విద్యార్థిపై ఈ విధంగా చేయి చేసుకోకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వాపోయారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories