పల్లెలకు ఆదర్శంగా నిలిచిన సుబ్బయ్యపల్లి

పల్లెలకు ఆదర్శంగా నిలిచిన సుబ్బయ్యపల్లి
x
Highlights

గ్రేటర్ వరంగల్ లోని సుబ్బయ్యపల్లి గ్రామంలో మధ్యపాణాన్ని పూర్తి స్థాయిలో నిషేధించారు. మద్య పాణ నిషేధాన్ని సాధించడంతో ఆ గ్రామ ప్రజలు ఎంతగానో...

గ్రేటర్ వరంగల్ లోని సుబ్బయ్యపల్లి గ్రామంలో మధ్యపాణాన్ని పూర్తి స్థాయిలో నిషేధించారు. మద్య పాణ నిషేధాన్ని సాధించడంతో ఆ గ్రామ ప్రజలు ఎంతగానో సంతోషిస్తున్నారు. దీంతో ఈ గ్రామం వరంగల్ జిల్లాలోని చుట్టుపక్కన ఉండే ఎన్నో గ్రామలకు మార్గదర్శకంగా నిలిచింది. అంతే కాక తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలకు కూడా ఇది ఈ గ్రామం మార్గదర్శకంగా నిలవబోతోంది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని 70 శాతం గ్రామాల్లో మద్యపానం వలనే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని ఒక పరిశోధనా బృందం నిర్వహించిన సర్వేలో తెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లోనే నాటు సారా తయారీ ఎక్కువగా ఉంటుందని, ముఖ‌్యంగా గిరిజన ప్రాంతాలలో 10 శాతం నుండి 15 శాతం వరకు. అక్రమంగా మద్యాన్ని తయారు చేస్తున్నారని తేలింది. ఈ ప్రాంతాల్లోని మహిళలతో పాటు మగవారు కూడా అధికంగా మద్యాన్ని సేవిస్తున్నారని తేలింది. 28 నుంచి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా మద్యపానానికి బానిసవుతున్నారని ఈ సర్వేలో వెల్లడైంది. యువత తాగి వాహణాలకు నడపడం వల్లనే ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరగుతున్నాయని తెలిపారు. ఈ మద్యపానం కారణంగానే ఎన్నో గొడవలు, హత్యలు జరుగుతున్నాయని ఈ సర్వేలో తేలింది.

గ్రామీణ ప్రాంతాల్లో ఉండే 25 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు గల వితంతువులను ఎవరినీ కదిలించినా వారిలో ఎక్కువగా మద్యపాణానికి అలవాటై చనిపోయిన వారి కుటుంబాలే కనిపిస్తున్నాయని సర్వే ద్వారా తెలిపారు.

ఈ నేపధ్యంలోనే సుబ్బయ్యపల్లి గ్రామస్తులు ఒక నిర్ణయానికి వచ్చారు. తమ గ్రామంలో మద్యపాణం నిషేధానికి కంకణం కట్టుకున్నారు. ఆ గ్రామంలో ఉన్న వైన్ షాపులను బెల్టు షాపులను మూసివేయడానికి ప్రయత్నాలు చేశారు. విజయం సాధించారు.

ఈ గ్రామాన్ని ఆర్శంగా తీసుకుని మిగిలిన పల్లెలు కూడా మద్యపాణ నిషేధానికి ముందడుగు వేసి వారి గ్రామాన్ని సస్యశ్యామలంగా తీర్చి దిద్దుకోవడానికి ప్రయత్నించండి.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories