హైదరాబాద్‌ ఒక హెల్త్‌ హబ్‌: గవర్నర్ తమిళిసై

హైదరాబాద్‌ ఒక హెల్త్‌  హబ్‌: గవర్నర్ తమిళిసై
x
Highlights

హైదరాబాద్ నగరంలోని హోటల్‌ తాజ్‌కృష్ణలో ఈ రోజున కార్డియోలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ తెలంగాణ వార్షిక సదస్సును ఈ రోజు నిర్వహించారు.

హైదరాబాద్ నగరంలోని హోటల్‌ తాజ్‌కృష్ణలో ఈ రోజున కార్డియోలాజికల్‌ సొసైటీ ఆఫ్‌ తెలంగాణ వార్షిక సదస్సును ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెతో పాటు ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కూగా ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయని తెలిపారు. ప్రస్తుత కాలంలో వైద్య బృందాలు అధునాతన టెక్నాలజీతో రోగులకు వైద్యం అందిస్తున్నారని తెలిపారు.

ఈ నేపథ్యంలోనే గుండె సంబంధిత వ్యాధి వచ్చిన వారికి కూడా అధునాతన టెక్నాలజీతో వైద్యం అందిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే గుండె మార్పిడి చేయడం కూడా సులభంగా మారిందని, కార్డియాలజీ విభాగం అంతగా అభివృద్ధి చెందిందని తెలిపారు. సోనాలజిస్ట్‌గా ఎన్నో హృదయాల చప్పుడు తాను వినేదాన్నని అన్నారు. యుక్త వయసులోనే ఎంతో మంది గుండెజబ్బుల బారిన పడుతున్నారన్నారని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నగరం హెల్త్‌ హబ్‌గా ఉందని ఆమె స్పష్టం చేసారు.

అనంతరం ఆరోగ్య శాక మంత్రి ఈటల రాజేందర్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో పేదలకు వైద్యం అందుబాటులో ఉండే విధంగా ఆస్పత్రులను ఏర్పాటు చేసారని తెలిపారు. అంతే కాకుండా ప్రభుత్వ ఆస్పత్రులలో ప్రజలు వైద్యం అందుకునే విధంగా వాటిని అభివృద్ది పరిచారని అన్నారు.

క్యాన్సర్‌ నివారణ కోసం కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. గర్బిణిల ఆరోగ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం పాలు, గుడ్లు అందిస్తుందన్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవించిన మహిళలకు కేసీఆర్‌ కిట్‌ ద్వారా ఆర్థికంగా అండగా ఉంటున్నట్లు తెలిపారు. అమ్మ ఒడి పథకం ద్వారా తల్లి బిడ్డను క్షేమంగా ఇంటికి చేర్చే విధంగా ఏర్పాట్లు చేసారని తెలిపారు. అంతే కాక ఇప్పటి వరకూ రాష్ట్రవ్యాప్తంగా 1.5 కోట్ల మందికిపైగా ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించినట్లు ఆయన స్పష్టం చేసారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories