పండగకు స్పెషల్ రైళ్లు..వివరాలు..

పండగకు స్పెషల్ రైళ్లు..వివరాలు..
x
Highlights

పండగొచ్చిందంటే చాలు ప్రజలు పట్టణాల నుంచి సొంత గ్రామాలకు పరుగులు తీస్తారు.

పండగొచ్చిందంటే చాలు ప్రజలు పట్టణాల నుంచి సొంత గ్రామాలకు పరుగులు తీస్తారు. ఈ ఏడాది కూడా సంకాంత్రిని పురస్కరించుకుని పట్టణవాసులు వారి సొంత ఊళ్లకు వెళ్లనున్నారు. ఈ సమయంలో ప్రయాణాలు చేయాలంటే పట్టపగలే చుక్కలు కనిపిస్తాయి. నెలరోజుల నుంచి రిజర్వేషన్లు చేసుకున్నప్పటికీ వారికి సీటు కన్ఫాం కాకుండా నిలబడి ప్రయాణం చేయాల్సిందే.

ఇలాంటి ప్రయాణికుల కాస్త ఉపశమనం కలిగించేందుకు అటు ఆర్టీసీ, ఇటు రైల్వే సాధ్యమైనంత వరకూ ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని ప్రత్యేక సర్వీసులను నడిపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ - నర్సాపూర్‌ మార్గంలో ఆరు ప్రత్యేక రైళ్లను నడపనుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

ఇక ప్రత్యేక రైళ్లి వివరాల్లోకెళితే..

సికింద్రాబాద్ నుంచి నర్సాపూర్..

జనవరి 10 శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ (82725) సువిధ ప్రత్యేక రైలు బయల్దేరుతుంది. 11వ తేదీన ఉదయం 4.30 గంటలకు నర్సాపూర్‌ చేరుకుంటుంది.

♦ జనవరి 11 రాత్రి 7.25 గంటలకు సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ సువిధ ప్రత్యేక రైలు (82731) బయల్దేరుతుంది. 12వ తేది ఉదయం 6 గంటలకు నర్సాపూర్‌ చేరుతుంది.

♦ జనవరి 12, 13 తేదీల్లో రాత్రి 7.25 గంటలకు సికింద్రాబాద్‌-నర్సాపూర్‌ స్పెషల్‌ (07256) రైలు బయల్దేరుతుంది. 12వ తేదీన బయలుదేరిన రైలు 13 ఉదయం 6 గంటలకు నర్సాపూర్‌ చేరుకోగా. 13వ తేదీన బయలు దేరిన రైలు 14వ తేదీన ఉదయం 6 గంటలకు నర్సాపూర్ చేరుకుంటుంది.

నర్సాపూర్ నుంచి సికింద్రాబాద్..

♦ జనవరి 18 శనివారం సాయంత్రం 6 గంటలకు నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ స్పెషల్‌ (07255) నర్సాపూర్‌ నుంచి బయల్దేరుతుంది. 19వ తేది ఉదయం 4 గంటలకు సికింద్రాబాద్‌‌కు చేరుతుంది.

♦ జనవరి 19 ఆదివారం రాత్రి 8 గంటలకు నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ సువిధ స్పెషల్‌ (82727) నర్సాపూర్‌ నుంచి బయల్దేరుతుంది. 20వ తేది ఉదయం 5.50కి సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories