హైటెక్స్ లో స్కైవాక్‌

హైటెక్స్ లో స్కైవాక్‌
x
Highlights

ట్రాఫిక్ బారిన పడకుండా సాఫీగా షాపింగ్ కు వెళ్తే బాగుండేది అని చాలా మంది షాపింగ్ ప్రియులు అనుకుంటుంటారు.

ట్రాఫిక్ బారిన పడకుండా సాఫీగా షాపింగ్ కు వెళ్తే బాగుండేది అని చాలా మంది షాపింగ్ ప్రియులు అనుకుంటుంటారు. ఇప్పుడు వారి కల నెరవేరింది అది ఎలాగంటారా..! ఎల్‌అండ్‌టీ వారు ఇప్పుడు నేరుగా మెట్రో స్టేషన్ నుంచి షాపింగ్ మాల్ కు వెళ్ళడానికి స్కైవాక్‌ను ఏర్పాటు చేసింది.

హైటెక్‌సిటీ మెట్రో స్టేషన్‌ నుంచి ఎల్‌అండ్‌టీ నెక్టస్‌ గలేరియా మాల్‌ను కలుపుతూ నిర్మించిన స్కైవాక్‌ సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. స్టేషన్‌లో దిగిన ప్రయాణికులు సరాసరి గలేరియా మాల్‌కు వెళ్లి షాపింగ్‌ చేసుకునే వెసులుబాటును కల్పించింది. ట్రాఫిక్, పొల్యూషన్‌ సమస్యల బారిన పడకుండా షాపింగ్‌కు వెళ్లే వారికి ఇదొక మంచి అవకాశమని ఎల్‌అండ్‌టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి అన్నారు.

ఇప్పటికే పంజాగుట్ట మెట్రోస్టేషన్‌ పరిధిలో ఈ సదుపాయం అందుబాటులోకి వొచ్చిందన్న విషయం అందరికీ తెలిసిందే. రవాణా ఆధారిత అభివృద్ధిలో భాగంగా ఎల్‌అండ్‌టీ సంస్థ నగరంలో కొన్నిచోట్ల మాల్స్‌ నిర్మించడమే కాదు, వాటిని మెట్రో స్టేషన్లకు అనుసంధానం చేసింది. ఈ విధంగా ప్రపంచ స్థాయి సదుపాయాలను గ్రేటర్‌ సిటిజన్లకు పరిచయం చేస్తున్నందుకు ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories