పెంపుడు కుక్క మిస్సింగ్ : ఆచూకీ కోసం ఫ్లెక్సీలు..

పెంపుడు కుక్క మిస్సింగ్ : ఆచూకీ కోసం ఫ్లెక్సీలు..
x
Highlights

మనిషి తప్పిపోతే ఆచూకీకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. అలాంటిది తప్పిపోయిన శునకం జాడ కోసం ఓ జంతు ప్రేమికుడు చేయని ప్రయత్నం లేదు. పేపర్లల టీవీల్లో.,...

మనిషి తప్పిపోతే ఆచూకీకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. అలాంటిది తప్పిపోయిన శునకం జాడ కోసం ఓ జంతు ప్రేమికుడు చేయని ప్రయత్నం లేదు. పేపర్లల టీవీల్లో., గోడ ప్రతుల ద్వారా కుక్క తప్పిపోయిందంటూ ప్రకటనలు ఇచ్చాడు. కుక్క ఆచూకి తెలుపాలంటూ వీదుల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో కులవృత్తి చేసుకుని తాత్కాలిక కుటీరం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న సాలంకి శ్రీను రెండు కుక్క పిల్లలను తెచ్చుకుని అల్లారుముద్దుగా పెంచుతూ ప్రేమగా చూసుకుంటున్నాడు. ఇందులో ఓ కుక్క ఈనెల ఎనిమిదో తేదీ నుంచి కనిపించకుండా పోయింది. కుక్క తప్పిపోయిందన్న బాధతో తీవ్ర మనోవేధనకు గురయిన శ్రీను పట్టణం అంతా గాలించాడు. అయినా కుక్క ఆచూకి దొరక్కపోవడంతో వినూత్నంగా ఫ్లెక్సీ తయారు చేసి ప్రధాన కూడలిలో కట్టాడు.

అల్లారుముద్దుగా పెంచుకున్న కుక్క కనిపించకపోవడంతో శ్రీను దగ్గర ఉన్న మరో కుక్క కూడా బెంగపెట్టుకుంది. ఏమీ తినడంలేదు. కుక్క ఆచూకి తెలిస్తే చెప్పాలంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కుక్క తప్పిపోవడం ఉన్న మరో కుక్క కూడా తినడం మానేయడంతో శ్రీను కన్నీటి పర్యంతమవుతున్నాడు. జంతుప్రేమికులు తన ఆవేదన అర్ధం చేసుకుని తప్పిపోయన కుక్క కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరుతున్నాడు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories