మోడల్ స్కూల్ టీచర్లకు గుడ్ న్యూస్

మోడల్ స్కూల్ టీచర్లకు గుడ్ న్యూస్
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

తెలంగాణలొ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే ఉద్యోగుల కోసం ఎప్పటికప్పుడు కొత్త...

తెలంగాణలొ టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేసే ఉద్యోగుల కోసం ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ ను మారుస్తూనే ఉంది. కార్మికులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండడానికి ఎంతగానో కృషి చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పుడు ఇదే కోణంలో మోడల్ స్కూల్ టీచర్లకు కొత్త రూల్స్ ను తీసుకొచ్చి శుభవార్తను తెలిపింది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే (పీజీటీ, టీజీటీ) టీచర్ల మాదిరిగానే మోడల్ స్కూల్ టీచర్లకు కూడా సర్వీస్ రూల్స్ అమలు చేస్తున్నారు. దీనివలన మోడల్ స్కూల్లో పనిచేస్తున్న టీచర్లకు బదిలీలతో పాటు, పదోన్నతులు కూడా కల్పించే అవకాశాలు ఉంటాయని మోడల్ స్కూల్ సొసైటీ తెలిపింది. రాష్ట్రంలో మొత్తంగా చూసుకుంటే 194 మోడల్ పాఠశాలలు ఉన్నాయన్నారు. ఈ లాభాలను పొందడానికి అర్హులైన టీచర్లు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే 3000 మంది ఉన్నారన్నారు. దీనికి సంబంధించిన ఫైల్ పై బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతూ సంతకం చేసిందని మోడల్ స్కూల్ సొసైటీ డైరెక్టర్ ఏ సత్యనారాయణరెడ్డి తెలిపారు.

తమకు సర్వీస్ నిబంధనలు కల్పించడంపై మోడల్ స్కూల్ టీచర్ సంఘాల నేతలు జగదీశ్, యాకమల్లు హర్షం వ్యక్తం చేసారు. పీఆర్టీయూటీఎస్ నాయకులు శ్రీపాల్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, యూటీఎఫ్ నాయకులు రాములు, సీహెచ్ రవి, ఎస్టీయూ నాయకులు పర్వతరెడ్డి, సదానందంగౌడ్, పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర నాయకులు మారెడ్డి అంజిరెడ్డి, చెన్నయ్య సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.ఉపాధ్యాయుల కోసం మరిన్ని పథకాలు అమలు చేయాలని వారు తెలిపారు. విద్యార్థులక భవిష్యత్తును తీర్చిదిద్దే ఉపాధ్యాయుల భవిష్యత్తును ప్రభుత్వం తీర్చి దిద్దిందని ఈ ప్రభుత్వానికి ఎంతగానో రుణపడి ఉంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories