వారికి ఈ నెల జీతాల్లోనూ కోత తప్పదు : తెలంగాణా సీఎం కేసీఆర్

వారికి ఈ నెల జీతాల్లోనూ కోత తప్పదు : తెలంగాణా సీఎం కేసీఆర్
x
Highlights

తెలంగాణా రాష్ట్రంలో ఉద్యోగులు ఆశించినట్టు జరగలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు జరపిన సమీక్షా సమావేశంలో ఉద్యోగుల మేనెల్ వేతనాలు పూర్తిగా చెల్లించే...

తెలంగాణా రాష్ట్రంలో ఉద్యోగులు ఆశించినట్టు జరగలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు జరపిన సమీక్షా సమావేశంలో ఉద్యోగుల మేనెల్ వేతనాలు పూర్తిగా చెల్లించే నిర్ణయం తీసుకుంటారని భావించారు. అయితే, మే నెలలోనూ ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వేతనాల్లో కోత విధించనున్నట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఈరోజు ప్రగతి భవన్ లో మంత్రులు, ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు నిర్ణయాలను ఆయన వెల్లడించారు.

లాక్ డౌన్ కారణంగా ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు వేతనాల్లో విధిస్తున్న కోట యధాతథంగా ఉంటుందని సీఎం చెప్పారు. అదేవిధంగా ప్రతి కుటుంబానికీ ఇస్తున్న 1500 రూపాయల ఆర్ధిక సహాయాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఇక రేషన్ కార్డు దారులకు ఇస్తున్న 12 కేజీల బియ్యం మాత్రం ఇస్తారని వెల్లడించారు.

సమీక్షా సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాష్ట్రం అప్పులను రీషెడ్యూల్ చేయకపోవడంతో ఏడాదికి దాదాపు రూ. 37,400 కోట్ల మేర వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని అధికారులు వివరించారు. అదేవిషంగా రాష్ట్రానికి నెలకు 12 వేల కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. కానీ కేవలం 3,100 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని చెప్పారు. లాక్ డౌన్ నిబంధనలు సదలించినా.. రిజిస్ట్రేషన్లు, రవాణా వంటి రంగాల్లో ఆదాయం పెద్దగా లేదన్నారు.

అధికారులు ఇచ్చిన వివరాలను చూసిన తరువాత కేసీఆర్ వేతనాల్లో కోట కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆర్టీసీ సర్వీసులకు కర్ఫ్యూ నిబంధనల నుంచి సడలింపు ఇచ్చారు. ఇక రాత్రి సమయంలో బస్సులో నగరానికి వచ్చిన వారు తమ టికెట్ చూపించి ఆటోలు, టాక్సీలలో ఇళ్ళకు చేరుకోవచ్చని కేసీఆర్ చెప్పారు. అదేవిధంగా బస్సులను జేబీఎస్ తో పాటు, ఎంజీబీఎస్ వరకూ నడపడానికి అనుమతించారు.








Show Full Article
Print Article
More On
Next Story
More Stories