ప్రయాణికులతో ఉన్న ఆర్టీసీ బస్సు చోరీ

ప్రయాణికులతో ఉన్న ఆర్టీసీ బస్సు చోరీ
x
Highlights

హైదరాబాద్ నగరంలో గతంలో ఓ సారి కుషాయిగూడలో ఆర్టీసీ బస్సు చోరీకి గురైన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో వికారాబాద్ జిల్లాలోనూ ఓ బస్సు చోరి అయ్యింది.

హైదరాబాద్ నగరంలో గతంలో ఓ సారి కుషాయిగూడలో ఆర్టీసీ బస్సు చోరీకి గురైన విషయం తెలిసిందే. ఇప్పుడు అదే తరహాలో వికారాబాద్ జిల్లాలోనూ ఓ బస్సు చోరి అయ్యింది. చోరీ అయిన బస్సు ఖాలీ బస్సుకూడా కాడు ఏకంగా ప్రయాణికులతో నిండిఉన్న బస్సు చోరికి గురయ్యింది. అంతే కాదు ఆ బస్సులో డ్రైబర్, కండక్టర్ ఇద్దరూ లేకపోవడం విషేశం.

ఈ విషయంపై వికారాబాద్ డిపో మేనేజన్ రాజశేఖర్ తెలిపిన వివరాల్లోకెలితే తాండూరు డిపోలో బస్సును ఆపి డ్రైవర్, కండర్టర్ భోజనానికి దిగారని చెప్పారు. భోజనం తరువాత వారు వచ్చి చూడగా బస్ కనిపించలేదని దాంతో డ్రైవర్ , కండక్టర్ డిపో మేనేజర్ రాజశేఖర్ కు తెలిపారని చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న మేనేజర్ వెంటనే సెక్యూరిటీ సిబ్బంధితో బస్సును వెతికించారని అయినా ఫలితం లేదని తెలిపారు. సరిగ్గా అదే సమయానికి ఓ ప్రయాణికుడు బస్సుకు సంబంధించిన సమాచారం ఇచ్చాడని తెలిపారు.

ఎవరో గుర్తు తెలియని ఒక వ్యక్తి మద్యం మత్తులో బస్సును నడిపాడని తెలిపారు. తానే డ్రైవర్, తానే కండక్టర్ అని చెప్పి బస్సును ఇష్టానురీతిగా డ్రైవ్ చేసాడని తెలిపారు. దీంతో ప్రయాణీకులు ఆ వ్యక్తిని ప్రశ్నించడంతో ప్రయాణీకులతో ఉన్న ఆర్టీసీ బస్సును సిటీ శివారులో రోడ్డుపై వదిలేసి పారిపోయాడని తెలిపారు. బస్సు సమాచారం రాగానే బస్సు డ్రైవర్ ని, కండక్టర్ ను పంపించామని తరువాత పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు.

ప్రయాణీకులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ సంఘటనతో ప్రయాణికులంగా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఆర్టీసీ యాజమాన్యం రక్షణ విషయంలో నిర్లక్ష్యమం వహిస్తుందని ప్రయాణీకులు విమర్శిస్తున్నారు. దీంతో స్పందించిన అదికారులు ఇటువంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories