ఇదీ మన మంచికే! కరోనా దెబ్బకి తగ్గిన గృహహింస కేసులు..

ఇదీ మన మంచికే! కరోనా దెబ్బకి తగ్గిన గృహహింస కేసులు..
x
Highlights

లాక్ డౌన్ కారణంగా ప్రజలు కొంత మేరకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ సమాజంలో కొంత వరకు మంచే జరుగుతుందని చెప్పుకోవచ్చు.

లాక్ డౌన్ కారణంగా ప్రజలు కొంత మేరకు ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ సమాజంలో కొంత వరకు మంచే జరుగుతుందని చెప్పుకోవచ్చు.కష్టం తో దొరికే సుఖం. ఆ సుఖంతో వచ్చే విచ్చలవిడితనం. ఆ పైన మళ్లీ వచ్చే ఇక్కట్లు. ఇది మానవజీవితంలో చక్రంలా తిరిగే సహజమైన చర్య. అయితే ఇబ్బందులు నేర్పించే పాఠాలు అన్నీ ఇన్నీ వుండవు. వాటిని అర్ధం చేసుకుని ఆచరిస్తే ప్రకృతి హర్షిస్తుంది. ఈ ఇక్కట్ల పాఠాలకి కులమతాల ద్వేషాలు.. రాజకీయ విద్వేషాలు వుండవు. సరిగ్గా అటువంటి పాఠాలనే మోసుకొచ్చింది కరోనా వైరస్.

ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సమాజంలో మంచి మార్పులు రావడమే కాదు క్రైం రేట్ కూడా తగ్గిపోతుందని ఇటీవల అధికారులు ఓ సర్వేలో తెలిపారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు, దొంగతనాలు, అలాగే ఎక్కవగా నమోదయ్యే గృహహింస కేసుల సంఖ్య గణనీయంగా తగ్గాయని వెల్లడి చేశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు కాక ముందు రోజుకు గరిష్టంగా 550కిపైగా కేసులు నమోదయ్యేవని ప్రస్తుతం కనిష్టంగా 80–90 మధ్య నమోదవుతున్నాయి. అంటే సుమారుగా 5 రెట్లు కేసులు సంఖ్య తగ్గిందని తెలిపారు.

అదే విధంగా గృహహింస కేసులు కూడా సుమారుగా ప్రతినెల 10 నుంచి 12 వేల వరకు నమోదయ్యేవని, ప్రస్తుతం 3 వేలకు పడిపోయిందన్నారు. ఉత్తరాది ప్రాంతాల్లో ఈ కేసుల సంఖ్య ఎలా ఉన్నప్పటికీ దక్షిణాదిన మాత్రం ఈ గణాంకాలను చూస్తే తగ్గాయని తెలుస్తోంది. ఈ గణాంకాలను డయల్‌ 100కు వ చ్చే కాల్స్‌ ఆధారంగా తీసుకున్నట్టు అంచనా. లాక్ డౌన్ కారణంగా మద్యం దుకాణాలు మూతపడడంతో తాగి గొడవలకు పొకుండా ఉంటున్నారు. ఎక్కువ సమయం కుటుంబంతోనే గడుపుతుండడంతో కలహాల కాపురాలు కూడా చక్కబడుతున్నాయని పోలీసులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories