logo

కారు బోల్తా పడి ముగ్గురు మృతి, నలుగురికి గాయాలు

కారు బోల్తా పడి ముగ్గురు మృతి, నలుగురికి గాయాలు
Highlights

స్నేహితుడి సోదరి వివాహానికి వెళ్తూ కారు బోల్తా పడి ముగ్గురు మృతి, నలుగురు గాయాల పాలైన ఘటన షాద్‌నగర్ మండలం బూర్గుల టోల్‌గేట్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది

స్నేహితుడి సోదరి వివాహానికి వెళ్తూకారు బోల్తా పడి ముగ్గురు మృతి, నలుగురు గాయాల పాలైన ఘటన షాద్‌నగర్ మండలం బూర్గుల టోల్‌గేట్ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే టీఎస్ 08 జీక్యూ 4484 నంబర్ గల మారుతి ఎర్టిగా కారులో ఏడుగురు స్నేహితులు హైదరాబాద్ నుంచి అనంతపూర్ బయల్దేరారు. షాద్‌నగర్ వద్ద ఉన్న టోల్‌గేట్ వద్దకు రాగానే ముందు వెళ్తున్న మరో కారును ఓవర్‌టేక్ చేసే క్రమంలో కారు అదుపుతప్పింది. దీంతో కారు 20 ఫీట్ల ఎత్తుకు ఎగిరి రోడ్డు పక్కన ఉన్న పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఏడుగురు యువకుల్లో ముగ్గురు యువకులు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటనతో హైవేపై ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. ప్రమాదస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలకు పంచనామా చేసి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.


లైవ్ టీవి


Share it
Top