ప్రాణాపాయ స్థితిలో రెస్క్యూ బ్రిగేడియర్లు

ప్రాణాపాయ స్థితిలో రెస్క్యూ బ్రిగేడియర్లు
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ ఖనిజం ఉందంటే అది నల్ల బంగారం మాత్రమే.

తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ ఖనిజం ఉందంటే అది నల్ల బంగారం మాత్రమే. ఈ నల్ల బంగారాన్ని భూగర్భం లోపన నుంచి వెలికితీయడమంటే మాటలు కాదు. ఎంతో వ్యయప్రయాసలతో కార్మికులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భూగర్భంలోకి దిగి వెలికితీస్తారు. ఇలాంటి కొన్ని సమయాల్లో ప్రమాదాలు జరిగి ఎంతో మంది కార్మికుల ప్రాణాలు కూడా పోతుంటాయి. మరికొంత మంది కార్మికలు భూగర్భంలోనే చిక్కుకుపోయి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంటారు.

అలాంటి సమయంలో ఆపదలో ఉన్న కార్మికులను కాపాడటాని ఏర్పాటు చేసిందే సింగరేణి రెస్క్యూ టీం. ప్రమాదంలో ఉన్న ఎంతో మందిని కాపాడిన రెస్క్యూ బ్రిగేడియర్లు ఇప్పుడు ఆపదలో చిక్కుకున్నారు. మూత పడిన గనిని పరిశీలించడానికి వెళ్లి ఆరుగురు రెస్క్యూ బ్రిగేడియర్లు వారి ప్రాణాల మీదికి తెచ్చుకున్నారు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్‌ పరిధిలోని ఏఎల్‌పీ గనిలో చోటు చేసుకుంది. ఆర్జీ–2 ఏరియాలోని మెయిన్‌ రెస్క్యూ స్టేషన్‌కు చెందిన 22 మంది రెస్క్యూ టీం సాహసాన్ని చేసారనే చెప్పుకోవాలి. తెరచి ఉన్న గనిలోకి వెళ్లిన వారే కొన్ని సార్లు ప్రాణాలతో బయటికి రావడం కష్టం. కానీ వారంతా సూపరింటెండెంట్‌ సలీం ఆధ్వర్యంలో అడ్రియాల లాంగ్‌వాల్‌ ప్రాజెక్టు గనిలోని మూసివేసిన సీమ్‌లను పరిశీలించేందుకు చేరుకున్నారు.

గనిపైన వారంతా మూడు బృందాలుగా విడిపోయి పనివిభజనను చేసుకున్నారు. గనిలోని మూసివేసిన ప్యానళ్ల పరిస్థితి తెలుసుకునేందుకు గనిలోని 80వ ప్యానల్‌కు ఆరుగురుతో కూడిన ఒక బృందం, మరో ఇద్దరు స్టాండ్‌బైగా వెళ్లారు. టీం కెప్టెన్‌ మోహన్‌ ఆధ్వర్యంలో దిలీప్, నవాబ్, మధుసూదన్‌రెడ్డి, అజయ్‌రాఘవ, నాగేశ్వర్‌రావులు అనే ఆరుగురు బ్రిగేడియర్లు 80వ ప్యానల్‌లోని ఎల్‌సీ–6 వద్ద చేరుకున్నారు. అక్కడ పనిని పూర్తి చేసుకుని తిరిగి వస్తున్న సమయంలో జంక్షన్‌ వద్ద టీం కెప్టెన్‌ మోమన్‌ అదుపు తప్పి మూడు మీటర్ల లోతులో పడిపోయాడు. అతనితో వచ్చిన మిగతా బ్రిగేడియర్లు ఆయనను కాపాడే ప్రయత్నం చేసారు. కెప్టెన్ మోహన్‌ కూడా పైకి రావాలని చాలాసార్లు ప్రయత్నించి అక్కడే అస్వస్థతకు గురయ్యాడు. అతడిని కాపాడడానికి ప్రయత్నించిన దిలీప్ కొద్ది దూరం మోహన్ ను భుజాలపై మోసి అస్వస్థతకు గురయ్యాడు దీంతో అతని పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారింది.

వెంటనే అక్కడున్న మరి కొంత మంది టీం సభ్యులు ఆ ఇద్దరిని సింగరేణి ఆస్పత్రికి హుటాహుటిన తీసుకెళ్లారు. అనంతరం అక్కడి నుంచి టీం కెప్టెన్‌ మోహన్‌ను కరీంనగర్‌ ఆస్పత్రికి, దిలీప్‌ను హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. వారితో పాటుగానే గనిలోకి దిగిన నవాబ్, మధుసూదన్‌రెడ్డి, అజయ్‌రాఘవ, నాగేశ్వర్‌రావులు స్వల్ప అస్వస్థతకు గురికాగా వారికి స్థానికి ఆస్పత్రిలో చికిత్స అందించారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్జీ–1, 2, 3 జీఎంలు కె.నారాయణ, ఎం.సురేశ్, సూర్యనారాయణలు వెంటనే సింగరేణి ఆస్పత్రికి చేరుకుని వారిని పరామర్శించారు. వారి పరిస్థితిని గురించి సమీక్షించారు. అనంతరం బాధితులను టీబీజీకేఎస్‌ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి బాధితులను పరామర్శించి సంఘటన ఏ విధంగా జరిగిందో తెలుసుకున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories