అయ్యా నేను బతికే ఉన్నా..

అయ్యా నేను బతికే ఉన్నా..
x
Highlights

మనిషి బతికుండగానే అతని పేరును చనిపోయిన వారి జాబితాలో ఎక్కించారు కొంతమంది ప్రభుత్వుద్యోగులు. అసలు మనిషి చనిపోయినాక కూడా డెత్ సర్టిఫికెట్ ఇవ్వడానికే...

మనిషి బతికుండగానే అతని పేరును చనిపోయిన వారి జాబితాలో ఎక్కించారు కొంతమంది ప్రభుత్వుద్యోగులు. అసలు మనిషి చనిపోయినాక కూడా డెత్ సర్టిఫికెట్ ఇవ్వడానికే తింప్పించుకునే ఆఫీసర్లు పాపం ఈ ముసలాయన బతికుండగానే చనిపోయినట్టు నిర్థారించి తనకు రావలసిన పింఛనును నాలుగు నెలలుగా ఆపేసారు.

దమ్మపేట మండలం ముష్టిబండ స్వగ్రామంలో చేపలమడుగు వెంకటేశ్వరరావు (85) అనే ఒక వృద్ధుడు ఉండేవారు. ఇతనికి నాలుగు నెలల క్రితం గుండెపోటు రావడంతో అతను హైదరాబాద్ లో ఉండే అతని కొడుకు దగ్గరికి వెళ్లాడు. కాస్త కోలుకుని తన స్వగ్రామానికి తిరిగివచ్చాడు. ప్రతినెలా పింఛను సరైన సమయానికి తన బ్యాంకు ఖాతాలో జమ అయ్యేది. కానీ నాలుగు నెలలుగా జమకావడం లేదు. అసలు పింఛను ఎందుకు జమకావడం లేదు కారణం ఏంటో తెలుసుకోవడానికి ఆ వృద్ధుని ఆధార్ కార్డును తీసుకుని కుటుంబసభ్యులు మండల కార్యాలయానికి వెళ్లారు. అక్కడ జాబితాను పరిశీలించిన అధికారులు నమ్మలేని నిజం బయటపెట్టారు. అతను పేరు జాబితాలో చనిపోయినట్లుగా నమోదై ఉందని తెలిపారు.

దాంతో అతని కుటుంబ సభ్యలు ఆయన ఇంకా బతికే ఉన్నాడని అలా ఎలా చనిపోయినట్లు నమోదు చేస్తారని అధికారులను ప్రశ్నించారు. ఆయనకు మళ్లీ పింఛను రావాలంటే అతను బతికున్నట్టు ‌ధ్రువపత్రం తీసుకురావాలని కార్యాలయ అధికారులు తెలిపారు. ఈ విషయం గురించి ఎంపీడీఓను అడిగితే 3 నెలల క్రితం పింఛను లబ్దిదారులపై పంచాయతీ గుమస్తాలతో సర్వే చేయించామన్నారు. ఆ సమయంలో గ్రామాల్లో నివసించని వారి పేర్లు తొలగించారని ఆయన తెలిపారు. అయితే తొలగించడం మాట పక్కన పెడితే వెంకటేశ్వరావు చనిపోయినట్లు ఎందుకు జాబితాలో నమోదైందో విచారణ జరిపి బాధితులకు న్యాయం చేస్తామని తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories