New Year Effect: తెలంగాణాలో '370' కోట్లు..ఆంధ్రాలో '430' కోట్లు 'మందు' తాగేశారు!

New Year Effect: తెలంగాణాలో 370 కోట్లు..ఆంధ్రాలో 430 కోట్లు మందు తాగేశారు!
x
Highlights

న్యూ ఇయర్‌ సందర్భంగా డిసెంబరు 30, 31 తేదీల్లో రెండు రోజుల్లోనే 378 కోట్ల సరకు అమ్ముడయ్యింది.

మందు బాబులు పండగ చేసుకున్నారు, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. రెండు రోజుల్లో దాదాపు 800 కోట్ల రూపాయల మద్యం తాగేశారు! విచిత్రంగా మద్య నిషేధం వైపు అడుగులు వేస్తున్న ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణా కంటే ఎక్కువ మద్యం అమ్మకాలు జరిగాయి.

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మద్యం ఏరులై పారింది. నూతన సంవత్సరానికి స్వాగతం చెబుతూ డిసెంబర్‌ 30, 31 తేదీల్లో 378 కోట్ల మద్యాన్ని తాగిపారేశారు లిక్కర్‌ రాయుళ్లు. బీరు, మద్యం కలిపి రాష్ట్రంలో రెండు రోజుల్లోనే 83.43 లక్షల లీటర్లు ఖాళీ చేశారు. సగటు రోజువారీ అమ్మకాల కంటే డిసెంబరు 31వ తేదీ ఒక్కరోజే 150 శాతం ఎక్కువగా అమ్మకాలు జరిగాయి.

న్యూ ఇయర్‌ సందర్భంగా డిసెంబరు 30, 31 తేదీల్లో రెండు రోజుల్లోనే 378 కోట్ల సరకు అమ్ముడయ్యింది. విడివిడిగా చూసుకుంటే డిసెంబరు 30న 2.93 లక్షల కేసుల మద్యం, 2.97 లక్షల కేసుల బీర్ల చొప్పున 220 కోట్లు.. 31వ తేదీన 1.92 లక్షల కేసుల మద్యం, 2.15 లక్షల కేసుల బీర్ల చొప్పున 158 కోట్ల అమ్మకాలు జరిగాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి లిక్కర్‌ అమ్మకాలు భారీగా పెరగాయి.

తెలంగాణ వ్యాప్తంగా డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో ఒకే రోజు రాత్రి ఏకంగా 3వేల148 మంది మందుబాబులు చిక్కారు. ప్రమాద రహిత వేడుకలే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా 29 యూనిట్లలో పోలీసులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. డిసెంబరు 31న రాత్రి నుంచి ఈ తనిఖీలు కొనసాగాయి. ఈ క్రమంలో మొత్తం 3వేల148 మంది మందుబాబులు అడ్డంగా దొరికిపోయారు.

వీరిలో అత్యధికంగా హైదరాబాద్‌ నుంచే ఉన్నారు.

హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 950 మంది, సైబరాబాద్‌ పరిధిలో 873 మంది మందుబాబులు చిక్కారు. రాచకొండలో మాత్రం స్వల్పంగా 281 కేసులే నమోదయ్యాయి. ఇక కరీంనగర్‌లో 148, నల్లగొండలో 152, సిద్ధిపేట 99 చొప్పున మందుబాబులు దొరికారు. మంగళవారం రాత్రి 10 గంటలకు మొదలైన పోలీస్‌ స్పెషల్‌ డ్రైవ్‌ బుధవారం ఉదయం 8 గంటల వరకు సాగింది.

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌లో మందు కిక్ ఎక్కువైంది. ఇయర్ ఎండ్ రోజు వైన్స్ దగ్గర రష్ ఎక్కువగా ఉంటుందని చాలామంది ఒకరోజు ముందుగానే తీసిపెట్టు కున్నారు. దీంతో డిసెంబర్‌‌ 30వ తేదీ రాష్ట్రంలో రూ.250 కోట్ల అమ్మకాలు జరిగాయి. 31వ తేదీ సాయంత్రం 5 గంటల వరకే రూ.150 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగాయి. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మరో రూ.30 కోట్ల అమ్మకాలు జరుగుతాయని అధికారులు అంచనా వేశారు. గతేడాది డిసెంబర్ 31వ తేదీ రూ.100 కోట్లకుపైగా అమ్మకాలు జరిగాయని, ఈసారి దీనికి 50 శాతం కంటే ఎక్కువ అమ్మకాలు జరిగాయని చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్ ఫస్ట్​ నుంచి 19తేదీ వరకు రూ.1036 కోట్లు సేల్ చేయగా, నెల మొత్తం రూ. 2250 కోట్ల అమ్మకాలు జరిగాయన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories