రామచంద్రభారతి.. స్వామిజీనా..? తాంత్రికుడా..?

Ramachandra Bharati: బీజేపీలోని ఓ అగ్ర నేతతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు

R Tripura Malini
Published on: 27 Oct 2022 5:26 PM IST
Ramachandra Bharti currently staying in Delhi recently came to Telangana
X

రామచంద్రభారతి.. స్వామిజీనా..? తాంత్రికుడా..?

Rama Chandra Bharati: ఇక మొయినాబాద్‌లోని ఫామ్‌హౌజ్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో పోలీసులకు పట్టుబడ్డ ముగ్గురు వ్యక్తుల్లో ఫరీదాబాద్‌కు చెందిన రామచంద్రభారతి ఒకరు. ఆయన అసలు పేరు వి.కే సతీశ్ శర్మ(VK Sateesh Sharma) అని పోలీసులు చెబుతున్నారు. ఈయన స్వస్థలం హర్యానాలోని ఫరీదాబాద్. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో కపిలాశ్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు. ఇటీవల ఢిల్లీ నుంచి తెలంగాణకు వచ్చారని.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ ప్రముఖ నాయకుడి ఇంట్లో పూజలు నిర్వహించినట్లు సమాచారం.

ఎమ్మెల్యేలతో జరిపిన బేరసారాల్లో ఈయనదే కీలక పాత్ర అని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. బీజేపీలోని ఓ అగ్ర నేతతో ఆయనకు సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు.హరియాణాలోని ఫరీదాబాద్ సమీపంలో ఉన్న తిల్బాట్ ప్రాంతంలో ఆయన నివాసముంటున్నట్లు తెలుస్తోంది.

రామచంద్రభారతి వాట్సాప్ డీపీ ప్రకారం.. ఆయన ఓ తాంత్రికుడు అని స్పష్టమవుతోందని చెబతున్నారు. ఆ ఫొటోలో ఉన్న పూజాసామగ్రి కేరళీయులు వినియోగించే శైలిలో ఉన్నాయి. ఎదురుగా ఉన్న జ్యోతిలో 'ఏక వత్తు' మాత్రమే ఉంది. సాధారణంగా సాత్విక పూజల్లో రాజపూజల్లో రెండు వత్తులతో దీపం వెలిగించాలనేది శాస్త్రం. తాంత్రిక పూజల్లో మాత్రమే ఏక వత్తుతో దీపాన్ని వెలిగిస్తారు. దీన్ని బట్టి రామచంద్ర భారతి తాంత్రికుడా..? అనే అనుమానాలు రేకెత్తిస్తున్నాయి.

R Tripura Malini

R Tripura Malini

Next Story