గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటుతున్న రాచకొండ సీపీ భగవత్

గ్రీన్ ఇండియా ఛాలెంజ్.. మొక్కలు నాటుతున్న రాచకొండ సీపీ భగవత్
x
మొక్కలు నాటుతున్న సీపీ భగవత్
Highlights

పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించాలంటే ఎక్కువ శాతం చెట్లను పెంచాలంటుంది ప్రభుత్వం. ఇదే నేపధ‌్యంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని...

పెరుగుతున్న కాలుష్యాన్ని నివారించాలంటే ఎక్కువ శాతం చెట్లను పెంచాలంటుంది ప్రభుత్వం. ఇదే నేపధ‌్యంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ఇదే కోణంలో జోగినిపల్లి సంతోష్‌కుమార్ చెట్లను మరింత పెంచాలనే ఉద్దేశంతో గ్రీన్ ఇండియా అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఆయన రాచకొండ సీపీ భగవత్ కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను విసిరారు.

దీంతొ స్పందించిన సీపీ భగవత్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ముఖ్యమైన కార్యక్రమమని అన్నారు. మొక్కలు నాటడం చాలా మంచిదని మొక్కల వలన పర్యావరణం బాగుపడుతుందని తెలిపారు. అనంతరం ఛాలెంజ్ ను స్వీకరించి శనివారం రాచకొండ కమిషనరేట్ లో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా భారతదేశంలో విరివిగా మొక్కలు నాటుతారని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఈ ఛాలెంజ్ లో భాగంగా దాదాపు 4 కోట్ల మొక్కలు నాటారని తెలిపారు. ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలని సీపీ ఆశించారు. అనంతరం ఆయన కూడా మరో నలుగురు ప్రముఖులకి ఈ ఛాలెంజ్ ని విసిరారు. ఛాలెంజ్ ను అందుకున్న వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు, నటుడు షియాజీ షిండే, పూణే సీపీ వెంకటేశం, మానిష్ సాబూ ( ఇన్ఫోసిస్ పోచారం డీసీ హెడ్) ఉన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories