ఈ గాడిద నీది కాదు..నాదే!

ఈ గాడిద నీది కాదు..నాదే!
x
Representational Image
Highlights

ఆస్తుల కోసం, ఇంటి స్థలాల కోసం కొట్టుకునే వాళ్లను తరచూ చూస్తూనే ఉంటాం. కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం ఒక గాడిద కోసం కొట్టుకుంటున్నారు.

ఆస్తుల కోసం, ఇంటి స్థలాల కోసం కొట్టుకునే వాళ్లను తరచూ చూస్తూనే ఉంటాం. కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రం ఒక గాడిద కోసం కొట్టుకుంటున్నారు. పాపం ఆ గాడిదని దాని పిల్లని నాదంటే నాదంటూ మూడు రోజులగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. వీరిద్దరి గొడవతో ఈ గాడిద ఎవరికి చెందిందో చెప్పలేక ఏంచేయాలో తెలియక పోలీసులు తలలు బాదుకుంటున్నారు. ఈ వింత గొడవకు సంబంధించిన పూర్తి వివరాళ్లోకెలితే..

వికారాబాద్‌ మున్సిపల్‌ పరిధిలోని రామయ్యగూడలో బాణాల ప్రభు అనే వ్యక్తి నివాసం ఉంటున్నారు. ఇతని వృత్తి గాడిదలను మేపుతూ వాటి పాలను అమ్మడం. ఒకప్పుడు ఇతనికి 22 గాడిదలు ఉండగా, కాలక్రమేణా వాటిలో తొమ్మిది గాడిదలు అనారోగ్యంతో చనిపోయాయి. దీంతో ప్రభు చాలా నష్టపోయానన్నాడు. మరికొన్ని రోజులకు తన దగ్గరున్న మిగిలిన నాలుగు గాడిదలు కూడా తప్పిపోయాయని తెలిపాడు.

ఈ విషయంపై సెప్టెంబర్‌ నెలలో వికారాబాద్‌ పోలీసులకు ప్రభు ఫిర్యాదు చేశాడు. కానీ గ్రామంలో ఉన్న గాడిదల్లో తన గాడిదను గుర్తుపట్టడం తమకు కష్టమని.. మీరే వాటిని వెతికి ఆచూకీ చెబితే పట్టకొచ్చి ఇస్తామని పోలీసులు ప్రభుకి చెప్పారు. దీంతో బాధితుడు కొన్ని రోజులుగా ఊరూరా వెతికి ఆ గాడిదల సమాచారాన్ని పోలీసులకు చెప్పారు.

వెంటనే మోమిన్‌పేటలో ఉన్న తన గాడిద దగ్గరికి పోలీసులు వెళ్లారు. కానీ అప్పటికే దాన్ని డీసీఎంలో ఎక్కించి లింగంపల్లికి తీసుకెళ్లినట్లు స్థానికులు సమాచారం అందించారు. దీంతో పోలీసులు, బాధితుడు శనివారం లింగంపల్లికి చేరుకుని గాడిదను ఆటోలో తిరిగి వికారాబాద్‌ పీఎస్‌కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న పద్మ ఆ గాడిద నాదే అంటూ తన తండ్రి సత్తయ్యతో కలిసి వికారాబాద్‌ పీఎస్‌కు చేరుకుంది.

అక్కడ మొదలైంది అసలు కథ. స్టేషన్ కు తీసుకొచ్చిన గాదిడ తనదే అని, తనకు భర్త లేడని, ఇద్దరు పిల్లలున్నారని తెలిపింది. తనకు జీవనాధారం ఏం లేకపోవడంతో ఆ గాడిదను తన పుట్టింటి వాళ్లు కొనిచ్చారని తెలిపింది. దీంతో ఆ ఇద్దరూ ఆ గాడిద నాదంటే. నాది అంటూ అక్కడే గొడవకు దిగారు. దీంతో ఏం చేయాలో తోచని పోలీసులు మంగళవారం మరోసారి గాడిదను తీసుకొని స్టేషన్‌కు రావాలని చెప్పి పంపించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories