పట్టణ ప్రగతికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

పట్టణ ప్రగతికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
x
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
Highlights

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం నాలుగో రోజుకు విజయ వంతంగా చేరుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర మంత్రి వర్గం, అధికారులు అన్ని పట్టణాల్లో పర్యటిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమం నాలుగో రోజుకు విజయ వంతంగా చేరుకుంది. ఇందులో భాగంగానే రాష్ట్ర మంత్రి వర్గం, అధికారులు అన్ని పట్టణాల్లో పర్యటిస్తున్నారు. ఆయా పట్టణాల్లో జరిగే అభివృద్ది కార్యక్రమాలను పరిశీలిస్తున్నారు. ఈనేపథ్యంలోనే గురువారం రోజున రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఖమ్మం నగరంలో పర్యటించారు. ఖమ్మంలోని 14వ డివిజన్‌ ముస్తాఫానగర్‌, 35వ డివిజన్‌ మామిళ్లగూడెం, 42వ డివిజన్‌ పంపింగ్‌వెల్‌ రోడ్‌, 3వ డివిజన్‌ బల్లేపల్లిలో జరుగుతున్న అభివృద్ది పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో కలిసి ఆయన కాలనీలలో మొక్కలను నాటారు. అంతే కాకుండా కాలనీలలో విద్యుత్‌ స్థంబాల మార్పిడి, నూతన స్థంబాల ఏర్పాటు, మరమ్మతు పనులు, మురుగు కాలువల పూడికతీత పనులను ఆయన దగ్గరుండి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ ప్రగతి పనుల్లో జాప్యం చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని అధికారులను హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్దిలో భాగంగా మార్చి 1వ తేదీన పట్టన నగరంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారని తెలిపారు. ఇందుకు గాను ఇప్పటికే నిధులను కూడా విడుదల చేసారని తెలిపారు. ఈ లోగా ప్రస్తుత జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని మున్సిపల్‌ కమిషనర్‌కు ఆదేశాలు చేశారు. అనంతరం కాలనీ వాసులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. వారి సమస్యలను త్వరిత గతిన పరిష్కరిస్తామని తెలిపారు. ఇక ఈ నేపథ్యంలోనే వైరా మున్సిపాలిటిలో ఎమ్మెల్యే రాములు నాయక్‌ మురుగు కాలువల్లో చెత్తను తొలగించి రోడ్ల వెంబడి ఉన్న కంప చెట్లను తొలగించారు.

అనతంరం వారు కూడా మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా పట్టణాలన మరింత సుందరంగా తీర్చిదిద్దుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరు కాలనీలకు శుభ్రంగా ఉంచుకోవాలనితెలిపారు.ఇక సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రగతి పనులను పరిశీలించి అధికారులకు, కౌన్సిలర్లకు పలు సూచనలు చేశారు. ఆయనతోపాటు మధిరలో జడ్పీ చైర్మన్‌ లింగాల కమల్‌రాజు పలు వార్డుల్లో పర్యటించి పనులు పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకంపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు. పరిసరాలు బాగుంటేనే ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు. అభివృద్ది పనుల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా అధికారులకు తెలిజేయాలని, ప్రతి ఒక్కరు ప్రగతికి సహకరించాలని కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories