పదో తరగతి హాల్ టికెట్ లో PUBG ఫొటో

పదో తరగతి హాల్ టికెట్ లో PUBG ఫొటో
x
Highlights

రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితాపై తప్పులు దొర్లుతుంటాయి. ఒకరిఫోటోకు బదులు ఒకరి ఫోటో ప్రింట్ అవ్వడం, పేర్లు తికమక పడడం, చిన్న పిల్లల పేర్లు...

రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ఓటర్ల జాబితాపై తప్పులు దొర్లుతుంటాయి. ఒకరిఫోటోకు బదులు ఒకరి ఫోటో ప్రింట్ అవ్వడం, పేర్లు తికమక పడడం, చిన్న పిల్లల పేర్లు జాబితాలో చేర్చడం. సినిమా హీరోల పేర్లు, ఫొటోలు, సినిమా పోస్టర్లు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇది ప్రతి ఎన్నికల్లో కనిపించే భాగోతమే. కానీ ఇప్పుడు విద్యాశాఖ కూడా ఇలాంటి తప్పులనే చేస్తుంది. విద్యార్థులు తమ కెరియర్ లో ఎక్కే మొదటి మెట్టు పదోతరగతి. ఇలాంటి పదో తరగతి హాల్ టికెట్ల విషయంలో విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వహిస్తుంది. విద్యార్ధుల పదోతరగతి హాల్ టికెట్లలో తప్పులు ముద్రిస్తుంది. అది కూడా పేరు, అడ్రస్, తండ్రి పేరు తప్పుగా ఉండడం కాదు. ఏకంగా ఒక గేమ్ పేరుతో హాల్ టికెట్ ను విడుదల చేసింది. అంతే కాదు విద్యార్థి తండ్రి పేరులో కూడా ఈ గేమ్ ను జోడించింది. బహుశా ఆ హాల్ టికెట్ ను ముద్రించిన వ్యక్తి ఆ గేమ్ ఆడుకుంటూ ముద్రించనట్టు ఉన్నాడు.

పూర్తివివరాల్లోకెళితే హైదరాబాద్‌ నగరంలోని షాలిబండకు చెందిన హిదాయత్ అనే విద్యార్థి 'S ది స్కూల్' అనే పాఠశాలలో చదువుకున్నాడు. కాగా రేపటి నుంచి రాష్ట్రంలో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో విద్యార్ధికి సంబంధించిన హాల్ టికెట్ విద్యార్ధి ఇంటికి హాల్ టికెట్ రోల్ నెంబర్ 2022114399తో ఇంటికి వచ్చింది. ఇందులో విద్యార్థి పరీక్ష సెంటర్ వివరాలు, పరీక్షల ఏయే రోజు ఉన్నాయనే వివరాలు ఉన్నాయి. కానీ అందులో ఉన్న ఫోటో మాత్రం ఆ విద్యార్థిది కాదు. విద్యార్ధి ఫోటోకు బదులు PUBG ఫొటో ఉంది. అంతే కాదు విద్యార్థి తండ్రి పేరు చివరన PUBG Lite అని, విద్యార్థి పేరు చివరన PUBG అని తగిలించారు. దాంతో విద్యార్థి ఇక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యాడు. ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఆ విద్యార్థి రేపు పరీక్షలో ఏం పేరు రాసి పరీక్ష రాస్తాడో వేచి చూడాల్సిందే.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories