తెలంగాణ ఐపీఎస్‌లకు పదోన్నతులు

తెలంగాణ ఐపీఎస్‌లకు పదోన్నతులు
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పాలనలో ప్రక్షాళన కోసం 39మంది ఐఏఎస్‌లకు స్థానచలనం కల్పించిన విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల పాలనలో ప్రక్షాళన కోసం 39మంది ఐఏఎస్‌లకు స్థానచలనం కల్పించిన విషయం తెలిసిందే. ఇందులో 21మంది కలెక్టర్లతోపాటు 18మంది సీనియర్‌ ఐఏఎస్‌లకు కొత్త పోస్టింగులను ఇచ్చారు. కాగా ఐఏఎస్ అదికారుల బదిలీల తరువాత ఐపీఎస్ అధికారులను కూడా మరుసటి రోజు, మంగళవారం బదదిలీ చేస్తారన్న వార్తలు భారీగా ప్రచారం సాగింది. అంతే కాదు ఇంకొంత మంది ఔత్సాహికులు ఒక అడుగు ముందుకేసి సీనియర్‌ ఐపీఎస్‌ అధికారుల బదిలీ జరిగి పోయిందంటూ ప్రచారం సాగించారు. దీంతో ఈ సందేశాలు క్షణాల్లో రాష్ట్రవ్యాప్తంగా వైరల్‌గా మారినప్పటికీ అలాంటి దేమీ జరగలేదు.

కాగా ప్రస్తుతం ఎప్పటినుంచో తెలంగాణ రాష్ట్రంలో ఐపీఎస్‌లుగా పనిచేస్తున్న అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఎస్పీలకు డీఐజీలుగా, డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి కల్పించింది. ఇందులో భాగంగానే డీఐజీ శివకుమార్‌ రెడ్డి, రాజేష్‌ కుమార్‌, రవీందర్‌కు ఐజీలుగా, డీఐజీలుగా ఉన్న రమేష్‌ నాయుడు, కార్తికేయన్‌, శ్రీనివాసులు, సత్యనారాయణ, సుమతి, వెంకటేశ్వరరావులు ఐజీలుగా ప్రమోట్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories