తెలంగాణా లో గోదారి ఎదురు నడక!

తెలంగాణా లో గోదారి ఎదురు నడక!
x
Highlights

తెలంగాణా లో వర్షాలు లేకపోయినా..మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నది పోటెత్తింది. దీంతో అది కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిసి మేదిగడ్డ బ్యారేజీ...

తెలంగాణా లో వర్షాలు లేకపోయినా..మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలకు ప్రాణహిత నది పోటెత్తింది. దీంతో అది కాళేశ్వరం వద్ద గోదావరిలో కలిసి మేదిగడ్డ బ్యారేజీ వద్ద భారీగా వరద నీటిని చేరుస్తోంది. కన్నేపల్లి పంప్ హౌస్ లో మూడు మోటార్లు ప్రస్తుతం పనిచేస్తోన్నాయి. అలాగే, గ్రావిటీ ద్వారా అన్నారం బ్యారేజికి నీరు చేరుతోంది. అన్నారం బ్యారేజీకి సాయంత్రానికి ఒక టీఎంసీ నీరు చేరే అవకాశం కనిపిస్తోంది. అలాగే మేడిగడ్డకు ప్రస్తుతం 24 వేల క్యోసేక్కుల వరద నీరు వస్తోంది. మేడారం బ్యారేజీలో 50 గేట్లనూ అధికారులు మూసివేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే పలుమార్లు వెట్‌ రన్‌, ట్రయల్‌ రన్‌ నిర్వహించిన 6 నెంబరు మోటారును శుక్రవారం రాత్రి 11.45 గంటలకు ప్రారంభించారు. శనివారం రాత్రి 10 గంటల నుంచి 1వ నెంబరు మోటారు; ఆదివారం రాత్రి 9 గంటల నుంచి 3వ నెంబరుమోటారు ప్రారంభించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories