పెళ్లిని అడ్డుకున్న పోలీసులు.. ఫంక్షన్‌హాల్‌కు నోటీసులు

పెళ్లిని అడ్డుకున్న పోలీసులు.. ఫంక్షన్‌హాల్‌కు నోటీసులు
x
Highlights

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిబంధనలను అతిక్రమించి నిర్వహిస్తున్న వివాహ వేడుకను పోలీసులు అడ్డుకున్నారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిబంధనలను అతిక్రమించి నిర్వహిస్తున్న వివాహ వేడుకను పోలీసులు అడ్డుకున్నారు. స్థానికులు తెలిపిన పూర్తివిరాల్లోకెళితే నిజామాబాద్‌ నగరంలోని న్యాల్‌కల్‌ రోడ్డులోగల ఓ ఫంక్షన్‌ హాల్‌లో శుక్రవారం జరుగుతున్న పెళ్లి వేడుకకు 120మంది వరకు అతిథులు హాజరయ్యారు. దీంతో స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమచారం అందిన వెంటనే 5వ టౌన్‌ ఎస్సై జాన్‌రెడ్డి తన సిబ్బందితో ఫంక్షన్ హాలుకుచేరుకున్నాడు.

వివాహానికి హాజరైన వారందరిని పెళ్లితంతు పూర్తికాక ముందు అక్కడి నుంచి వెనక్కి పంపించేసారు. ఎక్కడ పెళ్లి ఆగిపోతుందో అనే భయంతో వధూవరుల తల్లిదండ్రులు ఆ పోలీసులను పెళ్లి ఆగిపోకూడదని వేడుకున్నారు. దీంతో సరే అని ఒప్పుకున్న పోలీసులు ఓ షరతును పెట్టారు. ఇరు కుటుంబాల నుంచి కేవలం 8మంది మాత్రమే ఉండాలని సూచించారు. వారు చెప్పినట్టుగానే కేవలం 8మంది సమక్షంలోనే పెళ్లివేడును జరిపించారు. వివాహానికి హాజరైన మిగితవారందరిని అక్కడి నుంచి పంపించి వేశారు. దీంతో అతిథుల కోసం ఏర్పాటుచేసిన భోజనాలు అలాగే మిగిలిపోయాయి.

ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నివారణ చర్యలు చేపడుతుంటే క్షేత్రస్థాయిలో మాత్రం ఫంక్షన్‌హాల్‌ నిర్వాహకులు ఇలా నిబంధనలను అతిక్రమిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ విస్తరిస్తుండడంతో ఫంక్షన్లను నిర్వహించడానికి మున్సిపాలిటీ, పోలీసు శాఖ ఫంక్షన్‌హాళ్లకు అనుమతి ఇవ్వడం లేదు. కానీ దానికి విరుద్దంగా న్యాల్‌కల్‌ రోడ్డులోని ఓ ఫంక్షన్‌హాల్‌ పెళ్లికి అనుమతి ఇచ్చింది. నిజానికి నిబంధనల ఉల్లంఘించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేసి, మున్సిపల్‌ శాఖ వారు ఫంక్షన్‌హాల్‌ను సీజ్‌ చేసి అపరాద రుసుంతో పాటు తగిన చర్యలు తీసుకోవాలి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories