ఎవరు ఆయుధాలతో వచ్చినా ఇంతేనా..?

ఎవరు ఆయుధాలతో వచ్చినా ఇంతేనా..?
x
Highlights

అది హైదరాబాద్‌లో రద్దీ ఉన్న పెద్ద షాపింగ్ మాల్. పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి షాపింగ్‌ కోసం వస్తుంటారు. అటువంటి ప్రాంతంలోకి ఒక ఆగాంతకుడు గన్‌తో ప్రవేశించాడు. అయినా సెక్యూరిటీ సిబ్బంది గుర్తించలేకపోయారు.

అది హైదరాబాద్‌లో రద్దీ ఉన్న పెద్ద షాపింగ్ మాల్. పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి షాపింగ్‌ కోసం వస్తుంటారు. అటువంటి ప్రాంతంలోకి ఒక ఆగాంతకుడు గన్‌తో ప్రవేశించాడు. అయినా సెక్యూరిటీ సిబ్బంది గుర్తించలేకపోయారు. తనిఖీలు చేయడానికి అక్కడకు వచ్చిన పోలీసులకు ఆ ఆగాంతకుడు చిక్కాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని.. గన్ స్వాధీనం చేసుకున్నారు.

అయితే ఇదంతా నిజం కాదు. పోలీసుల మాక్ డ్రిల్. గణేష్ నవరాత్రి ఉత్సవాలు, ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో షాపింగ్ మాల్స్, రద్దీ ప్రదేశాల్లో పోలీసులు తనిఖీలు విస్తృతం చేశారు. దీనిలో భాగంగా అమీర్‌పేట బిగ్ బజార్లో పోలీసులు తనిఖీలు చేశారు. అయితే అక్కడ భద్రత డొల్ల తనం బయటపడింది. పోలీస్ కానిస్టేబుల్ సివిల్ డ్రెస్సుల్లో గన్‌తో లోనికి ప్రవేశించినా అక్కడి సిబ్బంది గుర్తించలేకపోయారు. దీంతో పోలీసులు షాపింగ్‌ మాల్ సెక్యూరిటీ సిబ్బందికి క్లాస్ పీకారు. నిజంగా ఎవరైనా ఆగాంతకులు ఇలానే లోపలికి ప్రవేశిస్తే ఏం చేస్తారని ప్రశించారు. భద్రత విషయంలో ఆలసత్వం వద్దని హెచ్చరించారు.

తనిఖీల్లో భాగంగా చాలా కాలంగా ఉన్న కారును పోలీసులు గుర్తించారు. అయితే అది ఎవరితో తెలియదని చెప్పడంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎవరు వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు..? వారి రికార్డులు నమోదు చేస్తున్నారా అని ప్రశ్నించారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. అనుమానస్పదంగా ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories