PM Narendra Modi: ఈ నెల 12న ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన

PM Narendra Modi: ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సి.ఎస్ సోమేశ్ కుమార్ సమీక్ష

Rama Rao
Published on: 4 Nov 2022 4:49 PM IST
PM Narendra Modi Will Visit Telangana on 12th of this Month | TS News
X

PM Narendra Modi: ఈ నెల 12న ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన

PM Narendra Modi: ప్రధాని మోడీ ఈ నెల 12న పెద్దపల్లి జిల్లా రామగుండంలో పర్యటించనున్నారు. ఎరువుల కర్మాగారమైన రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ ఎరువుల కర్మాగారమైన రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఎ్‌ఫసీthe ఎల్‌)ను ఆయన ఎన్‌టీపీసీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో జాతికి అంకితం చేస్తారు. ఇక్కడే సత్తుపల్లి-కొత్తగూడెం రైల్వే లైన్‌ను అధికారికంగా ప్రారంభిస్తారు. తెలంగాణకు మంజూరైన మూడు నేషనల్‌ హైవే ప్రాజెక్టులకు కూడా మోదీ రామగుండంలోనే శంకుస్థాపన చేయనున్నట్టు సమాచారం. కాగా, బొగ్గు రవాణాకు సంబంధించి సత్తుపల్లి-కొత్తగూడెం రైల్వే లైన్‌ నిర్మించారు.

సింగరేణి, రైల్వే సంయుక్త భాగస్వామ్యంతో రూ. 927.94 కోట్ల వ్యయంతో 54 కిలోమీటర్ల రైల్వే లైన్‌ను నిర్మించారు. ఇందులో సింగరేణిల రూ.618 కోట్లు వెచ్చించగా, రైల్వే రూ.109 కోట్లు వెచ్చించింది. ఈ ప్రాజెక్టు పూర్తయి వినియోగంలోకి కూడా వచ్చింది. దీనిని ఇక్కడి నుంచే ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ తరుణంలో రైల్వే సీనియర్‌ డీఆర్‌ఎం గురువారం రామగుండంలో సమీక్షించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లపై సమీక్షించేందుకు శుక్రవారం హైదరాబాద్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరుగనుంది.

Rama Rao

Rama Rao

Next Story