తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపకం పథకంపై హెకోర్టులో పిల్

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపకం పథకంపై హెకోర్టులో పిల్
x
Highlights

తెలంగాణలో గొర్రెల పంపిణీలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గొర్రెల పంపిణీ పథకంపై సీబీఐ...

తెలంగాణలో గొర్రెల పంపిణీలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. గొర్రెల పంపిణీ పథకంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వాచ్ వాయిస్ ఆఫ్ ది పీపుల్ అనే సంస్థ హైకోర్టులో పిల్ దాఖలు చేసింది.. గొర్రెల పంపకంలో భారీగా కుంబకోణం జరిగిందని పిటిషనర్ పేర్కొన్నారు.. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య ఎండీ, ది నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌తో పాటు సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories