బస్సులను రద్దు చేస్తే ప్రయాణికులకు ఇక్కట్లు తప్పవు: అశ్వత్థామరెడ్డి

బస్సులను రద్దు చేస్తే ప్రయాణికులకు ఇక్కట్లు తప్పవు: అశ్వత్థామరెడ్డి
x
జేఏసీ నాయకుడు అశ్వత్థామ రెడ్డి
Highlights

ఆర్టీసీ నష్టాల్లో ఉన్న కారణంగా తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలను తీసుకుంది. రద్దీ తక్కువగా ఉన్న ప్రాంతాలలోని కొన్ని బస్సులను రద్దు చేయనుంది.

ఆర్టీసీ నష్టాల్లో ఉన్న కారణంగా తెలంగాణ ప్రభుత్వం కొన్ని నిర్ణయాలను తీసుకుంది. రద్దీ తక్కువగా ఉన్న ప్రాంతాలలోని కొన్ని బస్సులను రద్దు చేయనుంది. ఈ విషయం పై స్పందించిన ఆర్టీసీ జేఏసీ నాయకుడు అశ్వత్థామ రెడ్డి బస్సులను రద్దు చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని 3,500 సిటీ బస్సులను రద్దు చేయడం వలన ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయన్నారు.

అంతే కాక కేసీఆర్ ఆర్టీసీ మహిళా కార్మికులకు ఇచ్చిన హామీలను అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. మహిళల పనివేళల విషయంలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను జారీచేయడం లేదని, అధికారులు వారి మాటను పట్టించుకోవడం లేదని అన్నారు. అది మాత్రమే కాక రెండేళ్ల పాటు యూనియన్లు ఉండవద్దని ఆర్టీసీ కార్మికులతో సంతకాలు చేయించుకోవడం సంమంజసం కాదన్నారు. ఆర్టీసీ యాజమాన్యంలో యూనియన్లు ఉండాలా? ఉండకూడదా? అనే విషయాలపై రహస్య ఓటింగ్ ను నిర్వహించాలని ఆ‍యన తెలిపారు.

ఆ ఓటింగ్ పద్ధతిలో ఏ నిర్ణయం వైపు కార్మికుల మొగ్గు చూపుతారో వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు తమ పొట్ట కూటికోసం ఉద్యోగాల్లో చేరారే తప్ప మనస్పూర్తిగా విధులను నిర్వహించడం లేదన్నారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ కూడా సంతోషంగా లేరని ఆయన స్పష్టం చేశారు. సమ్మె నిర్వహించిన కాలంలో కొంతమంది అధికారులు చాలా అవినీతికి పాల్పడ్డారని అలాంటి వారిపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories