ఈనెల 17న ఉస్మానియా యూనివర్సిటీ 80వ స్నాతకోత్సవం

ఈనెల 17న ఉస్మానియా యూనివర్సిటీ 80వ స్నాతకోత్సవం
x
Highlights

ఉస్మానియా విశ్వవిద్యాలయం 80వ స్నాతకోత్సవం నిర్వాహణకు సిద్ధం అవుతోంది. ఆరేళ్ల విరామం తర్వాత జరగబోతున్న స్నాతకోత్సవాన్ని అత్యంత ఘనంగా నిరహించేందుకు...

ఉస్మానియా విశ్వవిద్యాలయం 80వ స్నాతకోత్సవం నిర్వాహణకు సిద్ధం అవుతోంది. ఆరేళ్ల విరామం తర్వాత జరగబోతున్న స్నాతకోత్సవాన్ని అత్యంత ఘనంగా నిరహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు యూనివర్సిటీ అధికారులు. ఏడాది కాలంగా స్నాతకోత్సవంపై తర్జనభర్జన పడిన యూనివర్సిటీ అధికారులు ఓయూకు పూర్వ వైభవం వస్తుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఉస్మానియా యూనివర్సిటీ 80వ స్నాతకోత్సవానికి రంగం సిద్ధం అయ్యింది. ఈనెల 17 వ తేదీన స్నాతకోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. చరిత్రలో తొలిసారిగా వేడుకను లైవ్‌లో తిలకించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 2013 ఫిబ్రవరి 7న 79వ స్నాతకోత్సవం నిర్వహించారు. 2014 జూన్ నుంచి 2016 జూన్ వరకు రెండేళ్ల పాటు రెగ్యులర్ వైస్ ఛాన్స్ లర్ లేకపోవం ఆ తర్వాత రెగ్యులర్‌ వైస్‌ చాన్స్‌లర్‌ అందుబాటులో ఉన్నా శతాబ్ది ఉత్సవాలు జరగడం, న్యాక్‌ కోసం కృషి చేయడం ఇతర కారణాలతో స్నాతకోత్సవం వాయిదా పడుతూ వచ్చింది. గతంలో 1970, 80, 90లో రెగ్యులర్‌గా స్నాతకోత్సవం నిర్వహించారు.

గడిచిన ఆరేళ్ల కాలంలో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 2,896 మంది పీహెచ్‌డీ పూర్తి చేశారు. వీరిలో సుమారు 1800 మంది విద్యార్థులు తమ పీహెచ్‌డీ పట్టాలను ఎగ్జామినేషన్‌ బ్రాంచి నుంచి ఇప్పటికే పొందారు. మరో 1096 మంది డాక్టరేట్ పట్టాలను పొందాల్సి ఉంది. మరో 292 మంది పీజీ కోర్సులకు చెందిన విద్యార్థులు గోల్డ్‌మెడల్స్‌ పొందాల్సి ఉంది. ఇప్పటికైనా యూనివర్సిటీ అధికారులు స్నాతకోత్సవం నిర్వహించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం తర్వాత తొలిసారిగా ఉస్మానియా యూనివర్సీటీ స్నాతకోత్సవం జరుపుకోవడం ఎందో ఆనందాన్నిస్తుందంటున్నారు యూనివర్సిటీలో పీహెచ్ డీ పూర్తి చేసిన విద్యార్ధులు. స్నాతకోత్సవంలో గవర్నర్, ముఖ్య అతిథుల చేతుల మీదుగా యూజీ, పీజీ, పీహెచ్‌డీలలో స్వర్ణ పతకాలు సాధించిన వారికి ప్రదానం చేయనున్నారు. వీరితో పాటు 700లకు పైగా ఎంఫిల్, పీహెచ్‌డీ పట్టాలు అందించనున్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories