శ్రీరామనవమికి ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయం ప్రారంభం

శ్రీరామనవమికి ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయం ప్రారంభం
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో వున్న ఆలయాలలో భద్రాద్రి రాముని ఆలయం ఎంతో ప్రసిద్ధి గాంచింది. కాగా ఈ ఆలయంలో ప్రతి ఏడాది ఆ పట్టాభి రాముని కల్యాణోత్సవ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు.

తెలంగాణ రాష్ట్రంలో వున్న ఆలయాలలో భద్రాద్రి రాముని ఆలయం ఎంతో ప్రసిద్ధి గాంచింది. కాగా ఈ ఆలయంలో ప్రతి ఏడాది ఆ పట్టాభి రాముని కల్యాణోత్సవ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఈ వైభవాన్ని చూడటానికి తెలంగాణ రాష్ట్రం నుంచి మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. అయితే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఒక నిర్ణయానికి వొచ్చింది.

ఈ ఏడాది ఏప్రిల్‌ 2,3 తేదీల్లో జరిగే శ్రీరామనవమి మహోత్సవాలకు ఆన్‌లైన్‌లో టికెట్లను విక్రయిస్తుంది. ఈ టిక్కెట్లు తీసుకోవాలనుకున్న భక్తులు www.bhadrachalamonline.com వెబ్‌సైట్‌ ద్వారా తీసుకోవచ్చు. దాంతో పాటుగానే భధ్రాచలంలో మార్చి 25 నుంచి ఏప్రిల్‌ 8వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలను కూడా నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే 2వ తేదీన స్వామివారి తిరు కల్యాణ మహోత్సవం, 3న స్వామివారి మహాపట్టాభిషేకం నిర్వహిస్తున్నారు.

ఈ వేడుకలను భక్తులు వీక్షించేందుకు రూ.5 వేలు, రూ.2 వేలు, రూ.1116, రూ.500, రూ.200, రూ.100 విలువతో సెక్టార్‌ టిక్కెట్లు ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నామన్నారు. ఇతర వివరాలకు 08743-232428 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ వేడుకలకు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామి వారి ఆశిసులను తీసుకోవాలని తెలిపారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories