ఆన్‌లైన్‌ లోన్ యాప్ ‌ కేసులో దర్యాప్తు ముమ్మరం

ఆన్‌లైన్‌ లోన్ యాప్ ‌ కేసులో దర్యాప్తు ముమ్మరం
x
Highlights

* చైనాకు చెందిన వ్యక్తి సహా నలుగురు అరెస్ట్ * మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్న సీపీ సజ్జనార్ * నిందితుల బ్యాంక్ అకౌంట్ల నుంచి రూ.2 కోట్లు ఫ్రీజ్ * కంపెనీ ద్వారా 11 లోప్‌ యాప్స్ క్రియేట్ చేసిన నిందితులు * కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చైనాకు చెందిన జియా జాంగ్

ఆన్‌లైన్‌ లోప్‌ యాప్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇన్‎స్టంట్ లోన్ యాప్స్ ఫ్రాడ్ కేసులో చైనాకు చెందిన కీలక వ్యక్తితో పాటు నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్న సీపీ.. వారిలో ఒకరు చైనాకు చెందిన వ్యక్తిగా గుర్తించామన్నారు.

వీరి బ్యాంక్ అకౌంట్ నుంచి 2 కోట్లు ఫ్రీజ్ చేసి.. 2 ల్యాప్ టాప్స్, 4 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఇప్పటి వరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిథిలో 10 మంది నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపిన సీపీ.. హైదరాబాద్‎తో పాటు పలు నగరాల్లో ఆన్‌లైన్‌ యాప్స్ కార్యాలయాల్లో సోదాలు చేసినట్లు వివరించారు. ఈ సోదాల్లో కీలక ఆధారాలు సేకరింమని.. యాప్స్ కంపెనీల్లో రికవరీ ఏజెంట్లకు నోటీసులు ఇచ్చినట్లు సీపీ స్పష్టం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories