స్కిల్‌ జాబ్స్‌లో ముందంజలో ఉన్న నగరం ఏదో తెలుసా..?

స్కిల్‌ జాబ్స్‌లో ముందంజలో ఉన్న నగరం ఏదో తెలుసా..?
x
Highlights

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం అన్ని నగరాలకన్నా నైపుణ్య ఉద్యోగాల సాధనలో ముందంజలో ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగిత శాతాన్ని తగ్గించే విధంగా ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల్లో యువతకు అవకాశాలను కల్పిస్తూ ముందుకు దూసుకెళ్తుంది.

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం అన్ని నగరాలకన్నా నైపుణ్య ఉద్యోగాల సాధనలో ముందంజలో ఉంది. రాష్ట్రంలో నిరుద్యోగిత శాతాన్ని తగ్గించే విధంగా ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల్లో యువతకు అవకాశాలను కల్పిస్తూ ముందుకు దూసుకెళ్తుంది. అదే విధంగా నైపుణ్య ఉద్యోగాల కల్పన విషయంలోనూ అగ్రగామిగా నిలుచుంది. ఇందులో భాగాంగానే ప్రతి ఏడాది నిరుద్యోగ యువతకు సాంకేతిక రంగాల్లో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణకు విశేషం స్పందన రావడంతో ఎంతో మంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన విద్యార్థులు స్కిల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో శిక్షణ పొందుతున్నారు.

ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా 12 నేషనల్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సెంటర్ లో శిక్షణ పొందిన విద్యార్థులు మెరుగైన ఉద్యోగాలు సాధించడంతోపాటు వారి వారి రంగాల్లో ఉన్నతంగా రాణిస్తున్నారన్నారని తెలిపారు. గేతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 7785 మంది యువత పలుకంపెనీల్లో ఉద్యోగాలు దక్కించుకున్నారని స్పష్టం చేసారు. వారిలో 3374 మంది కేవలం హైదరాబాద్‌ జిల్లా వాసులే ఉండడం విషేశం. వీరందరిలో చాలా మంది పలు దేశ విదేశీ కంపెనీల్లో వృత్యంతర శిక్షణ పొందారని, తరువాతే ఉద్యోగాలు సాధించారని తెలిపారు.

తరువాత స్థానంలో రంగారెడ్డి జిల్లా నుంచి 893 మంది, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాలో 856 మంది, మెదక్‌లో 806 మంది, ఖమ్మంలో 390 మంది పలు కంపెనీల్లో అప్రెంటిషిప్‌ శిక్షణ పొంది అనంతరం ఉద్యోగాలు సాధించారు. ఇక ఉద్యోగం సాధించిన యువతలో ముఖ్యంగా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, స్మార్ట్‌ హెల్త్‌ , డ్రోన్‌ టెక్నాలజీ, 3డీ ప్రింటింగ్, కేర్, సోలార్‌ ఎనర్జీ, జియో ఇన్ఫర్మేటిక్స్, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ లాంటి కోర్సుల్లో స్వల్పకాలిక, దీర్ఘకాలిక శిక్షణను తీసుకుంటున్నారని, దాంతోనే ఉద్యోగాలు కూడా సాధిస్తున్నారని ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories