పసుపు రైతులకు శాశ్వత పరిష్కారం

పసుపు రైతులకు శాశ్వత పరిష్కారం
x
ఎంపీ ధర్మపురి అరవింద్
Highlights

నిజామాబాద్ జిల్లా రైతులు ఎన్నో ఏళ్ల నుంచి తమ జిల్లాలో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని పోరాడుతున్నారు.

నిజామాబాద్ జిల్లా రైతులు ఎన్నో ఏళ్ల నుంచి తమ జిల్లాలో పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని పోరాడుతున్నారు. అంతే కాకుండా వారు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించాలని గతేడాది ధర్నాలు కూడా చేసారు. ఇదే నేపధ్యంలో బీజేపీ ప్రభుత్వం తమకు న్యాయం కల్పిస్తుందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పసుపు పంటకు గిట్టుబాటు ధరలు కల్పిస్తుందని తెలిపారు. పసుపు రైతులకు శాశ్వత పరిష్కారం కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు.

బోర్డుల వలన పండించిన పంటలకు ఇప్పటివరకు ఎక్కడా న్యాయం జరగలేదన్నారు. ఇదే కోణంలో ప్రభత్వం ఏర్పాటు చేసిన కొన్ని బోర్డులు రద్దు చేసే అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి పసుపు పంటకి బోర్డుతో ఉండే అధికారాలతో పాటు, సమన్వయ కమిటీ ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ బోర్డు ఐఏఎస్ అధికారి సమక్షంలో పనిచేస్తుందన్నారు. ఇక మీదట పసుపు పంటను పండించే రైతులకోసం ప్రతి ఏటా రూ.100 కోట్ల నుంచి రూ.200 కోట్ల నిధులు ఇవ్వనున్నామని ఈ సందర్భంగా ఎంపీ ధర్మపురి చెప్పారు. ఇకపై రైతులకు సీడ్, ఎరువులు, అమ్మకం, కొనుగోలు, ఇన్సురెన్స్, క్వాలిటీని కూడా ఇక్కడే నిర్ణయిస్తామని, పసుపు బోర్డు కన్నా మంచి స్కీం పసుపు రైతులకు అందిస్తామన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories