Siddipet: తెగుళ్లను నివారించే వేపచెట్టుకు విపత్కర పరిస్థితులు

Neem Trees are Drying up in Siddipet
x

Siddipet: తెగుళ్లను నివారించే వేపచెట్టుకు విపత్కర పరిస్థితులు

Highlights

Siddipet: అపార ఔషధగుణాలున్న వేపచెట్టుకు దయనీయ పరిస్థితి

Siddipet: వృక్షాల్లో దైవత్వాన్ని, మహిమను, ఔషధగుణాలను పుణికిపుచ్చుకున్నవేప చెట్టు విపత్కర పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిఇంటా వేపచెట్టును ప్రత్యేకంగా పెంచుతారు. దేవతావృక్షంగా చాలాచోట్ల పూజిస్తారు. దివ్యౌషధ గుణాలను కలిగిన వేపచెట్టుకు ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానం ఉంది. వేపచెట్టులో చిగురునుంచి, ఆకు, పూత, బెరడు ఇలా ప్రతిదీ ఔషధగుణాలున్నవే. పంటలకు చీడపీడలున్నపుడు వేపనూనెను పిచికారీ చేసేవాళ్లు. అలాంటిది కాలక్రమంలో వేపచెట్టు ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది.

సిద్ధిపేటజిల్లా చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, చిన్నకోడూరు, నంగునూరు, సిద్ధిపేట రూరల్ మండలాల్లో వేపచెట్లు మోడువారుతున్నాయి. వేపచెట్టు చిగురు దశలోనే మాడిపోతోంది. తెగుళ్లను నివారించే వేప చెట్టుకు ఇదేంపరిస్థితి అని సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో నిద్రలేవగానే వేపచెట్టును చూసి తర్వాత పనులు మొదలు పెట్టేవారు. వేప పుల్లలతోనే పళ్లుతోముకునేవారు. అలాంటిది వేపచెట్టు ఎదుర్కొంటున్న పరిస్థితిని చూసి గ్రామీణులు విచారం వ్యక్తంచేస్తున్నారు.

కరోనా ముందు ఇలాంటి పరిస్థితి లేదని, కరోనా తర్వాత వేపచెట్లు విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని గ్రామీణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఔషధ గుణాలున్న చెట్టుగా భావించినప్పటికీ, విచిత్రంగా ఎండిపోతున్న తీరు ఆందోళన కలిగిస్తోందన్నారు. శాస్త్రవేత్తలు వేపజాతిని కాపాడుకోడానికి ప్రయత్నించాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories