కరోనా అనుమానంతో తల్లిని ఇంటి నుంచి గెంటేసిన కొడుకులు

కరోనా అనుమానంతో తల్లిని ఇంటి నుంచి గెంటేసిన కొడుకులు
x
Highlights

కరోనా వచ్చిన వారిపట్ల వివక్ష చూపించవద్దని పదే పదే ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న సంగతి తెలిసిందే.

కరోనా వచ్చిన వారిపట్ల వివక్ష చూపించవద్దని పదే పదే ప్రభుత్వాలు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న సంగతి తెలిసిందే.కానీ కన్న కొడుకులే నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని ఏదోలా వదిలించుకోవాలనుకున్నారు. కరోనా సోకిందనే సాకుతో కన్న తల్లి పట్ల కఠినంగా వ్యవహరించి ఓ వృద్దురాలిని రోడ్డుపై వదిలేసారు. ఈ అమానవీయ ఘటన కరీంనగర్ లోని కిసాన్ నగర్ లో చోటు చేసుకుంది.

కొద్ది నెలల క్రితం కరీంనగర్‌లోని కిసాన్‌నగర్‌కు చెందిన శ్యామల అనే వృద్ధురాలు మహారాష్ట్రలోని షోలాపూర్ వెళ్లింది. సరిగ్గా అదే సమయానికి లాక్ డౌన్ విధించడంతో రావడానికి ఎలాంటి వసతి లేకపోవడంతో ఆమె అక్కడే చిక్కుకుపోయింది. ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వాలు లాక్ డౌన్ సడలింపులు ఇవ్వడంతో ఆమె ఏదో ఒక విధంగా షోలాపూర్ నుంచి కరీంనగర్ లోని కొడుకుల ఇంటికి వచ్చింది. దీంతో ఆమె కొడుకు, కోడలు ఆమె వేరే రాష్ట్రం నుంచి వచ్చిందని, ఆమెకి కరోనా సోకిందేమో అన్న అనుమానంతో ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో ఆ వృద్దురాలికి ఏం చేయాలో తెలియక దిక్కుతోచక ఎక్కడికి వెల్లాలో తెలియక ఎర్రటి ఎండలో ఇంటి ముందే కూర్చుండిపోయింది. ఆ తల్లి దీన స్థితిని చూసి చుట్టు పక్కల వారు చీదరించిన వారి బుద్ధి మారలేదు. స్థానిక కార్పొరేటర్ అశోక్ కు విషయం చేరవేసారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా కార్పోరేటర్ జోక్యంతో వృద్దురాలిని ఆమె పెద్ద కొడుకు ఎట్టకేలకు ఇంట్లోకి తీసుకుని వెల్లాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories