కోమటిరెడ్డిపై ఎమ్మెల్యే సీతక్క సంచలన వ్యాఖ్యలు..

కోమటిరెడ్డిపై ఎమ్మెల్యే  సీతక్క సంచలన వ్యాఖ్యలు..
x
Highlights

కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యాలు ఏమాత్రం సమర్ధనీయం కాదంటున్నారు శాసనసభ్యురాలు సీతక్క. సుదీర్ఘ కాలంలో...

కాంగ్రెస్ పార్టీపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యాలు ఏమాత్రం సమర్ధనీయం కాదంటున్నారు శాసనసభ్యురాలు సీతక్క. సుదీర్ఘ కాలంలో పార్టీలో పదవులు అనుభవించిన తరువాత ఇటు వంటి ప్రకటనలు సరికాదన్నారు. నేతలంతా కలిసి నడిస్తే కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఏమాత్రం కష్ట కాదు అని అంటుంది సీతక్క. రాజగోపాల్ రెడ్డి అంటే మాకు అభిమానం కానీ ఇలాంటి బహిర్గతంగా మాట్లాడం మాట్లాడం మూలంగా అనేక సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న కాంగ్రెస్ పార్టీ లేదా ఆందోళనలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను మరింత ఆందోళన చెందే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఆమె అన్నారు. క్యాడర్ కి మనం ఏ రూపంలో బుస్టింగ్ ఇచ్చి క్యాడర్ ని కాపాడుగలుగుతాం అని ఆలోచించాలి తప్ప వేరే వారిని పొగిడి మనల్పి మనం కించపరుచుకునే విధంగా ఒక పార్టీ నేతలు మాట్లాడకుడదు అని అన్నారు. మనకు ఇంకా నాలుగు సంవత్సరాలు అవకాశం ఉంది కాబట్టి పార్టీలో ఉన్న లోపాలను, పార్టీని బలోపేతం చేసే దిశగా సాగాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి సంక్షోభలు సమస్యలు కొత్తఏమీకావు ఇది కాంగ్రెస్ పార్టీ ఎదురుకోగలుగుతుందన్నారు. నాయకత్వం, క్యాడర్, ఓటు బ్యాంకు ఉందని కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద పార్టీ అని అన్నారు. బీజేపీ పార్టీ ప్రత్యయ్నం అని అనడం సరికాదని అన్నారు.

కోమటిరెడ్డి బదర్స్ చాలా సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఓటమి కూడా లేకుండా ప్రతిరంగంలో వారు ముందున్నారు అయితే ఇంకో దారిలో పోయి మన దారి మనం చూసుకుంటే మాత్రం సరికాదన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ శాసనం అయింది. దీన్నిఎలా కాపాడుకోవాలి, ఎలా అభివృద్ధి చేసుకోవాలని ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ వెనకఅంజ పడింది కదా అని వారి దారి వారు చూసుకుంటే మాత్రం ఆ నాశనంలో మనం సూత్రదారులం, పాత్రదారులం అవుతాం అని అన్నారు. ఈ పార్టీపై గెలిచి, ఇదే పార్టీపై అభండాలు వేయడం పార్టీ క్యాడర్‌కు ఇబ్బందులు వచ్చే పరిస్థితులు వస్తాయన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories