Raja Singh: పీడీయాక్ట్ అడ్వయిజరీ బోర్డు ఎదుట హాజరుకానున్న ఎమ్మెల్యే రాజాసింగ్

Raja Singh: పీడీయాక్ట్‌ను రీవోక్ చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు

Jyothi
Published on: 29 Sept 2022 7:25 AM IST
MLA Rajasingh will Appear before PD Act Advisory Board
X

Raja Singh: పీడీయాక్ట్ అడ్వయిజరీ బోర్డు ఎదుట హాజరుకానున్న ఎమ్మెల్యే రాజాసింగ్

Raja Singh: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇవాళ పీడీయాక్ట్ అడ్వైజరీ బోర్డు ఎదుట హాజరుకానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాజాసింగ్ ను పీడీయాక్ట్ అడ్వైజరీ బోర్డు విచారించనుంది. ఇప్పటికే పీడీ యాక్ట్ ను రీవోక్ చేయాలని హైకోర్టులో రాజాసింగ్ కుటుంబ సభ్యులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. తెలంగాణ హైకోర్టు నాలుగు వారాలకు పిటిషన్ ను వాయిదా వేసింది. ఎమ్మెల్యే రాజాసింగ్ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగిందని..అందుకే తనపై లేనిపోని కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. తాను ఏ తప్పూ చేయలేదని..న్యాయపరంగా అది రుజువు అవుతుందని ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు.

hmtv బతుకమ్మ పాట 2022 కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Jyothi

Jyothi

Next Story