Top
logo

కొత్త గవర్నర్ల నియామకంపై హరీష్ రావు ట్వీట్

కొత్త గవర్నర్ల నియామకంపై హరీష్ రావు ట్వీట్
Highlights

కేంద్రం ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ నియమితులయ్యారు. కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌‌గా అవకాశం దక్కిన విషయం తెలిసిందే.

కేంద్రం ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించింది. తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్ నియమితులయ్యారు. కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయకు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌‌గా అవకాశం దక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తెలంగాణకు కొత్త గవర్నర్ నియామకాన్ని స్వాగతిస్తూ ట్వీట్టర్ ద్వారా స్పందిచారు. తెలంగాణ రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా నియమితులైన డాక్టర్ తమిళిసై సౌందర రాజన్‌కు అభినందనలు తెలియజేశారు. అలాగే హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌గా నియమితులైన బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయకు అభినందనలు తెలిపారు. కేంద్రమంత్రిగా గతంలో సేవలందించి.. తాజాగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్ గా దత్తాత్రేయ నియమితులు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు.
Next Story